ఇలాంటి వాటి మీద కూడా సినిమాలు తీస్తారా..? ఈ సినిమా చూశారా..?

ఇలాంటి వాటి మీద కూడా సినిమాలు తీస్తారా..? ఈ సినిమా చూశారా..?

by kavitha

Ads

కోలీవుడ్ ఇండస్ట్రీలో ‘గుడ్ నైట్’ అనే మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. మూవీ హిట్ కావడానికి భారీ సెట్టింగ్స్, హంగు, ఆర్భాటాలు ఉండాల్సిన అవసరం లేదని, ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేసే స్టోరీ, కథనం ఉంటే సరిపోతుందని ఈ మూవీ మరోసారి నిరూపించింది.

Video Advertisement

ఈ చిత్రం భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ మూవీ ‘గురక’ అనే పాయింట్ తో  తెరకెక్కింది.  తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది.  ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
మణికందన్, మీరా రఘునాథ్ ప్రధాన పాత్రలలో నటించిన ‘గుడ్ నైట్’ సినిమా ఈ ఏడాది మే 23న తమిళంలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి వినాయక్ చంద్రశేఖరన్ ద్రశకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే, సాఫ్ట్ వేర్ జాబ్ చేసే మోహన్ కు ఒక సమస్య ఉంటుంది. అతను నిద్రపోయాడంటే గురక రీసౌండ్ వస్తుంది. ఆ గురకకి పక్కింటివాళ్లు సైతం భయపడిపోవాలి. తన గురక వల్ల అందరూ తిడుతుంటారు.
ఒక రోజు ఊహించని పరిస్థితుల్లో అను పరిచయమవుతుంది. అందరితో అంతగా కలవని అను, మోహన్ ను ప్రేమిస్తుంది. కొద్ది రోజులకే వారి పెళ్లి జరుగుతుంది. మొదటిరాత్రి రోజు మోహన్ కు గురక సమస్య ఉందని అనుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు భార్యభర్తలు కలిశారా? లేదా అనేదే మిగతా కథ.హీరోకు సమస్య ఉన్న కథతో టాలీవుడ్ లోనూ సినిమాలు వచ్చాయి. మహానుభావుడు, భలే భలే మాగాడివోయ్ వంటివి.  ఆ కోవలో వచ్చిందే గుడ్ నైట్ మూవీ. హీరోకు ఉన్న గురక సమస్యతో ఇంట్లోవారు, పక్కింటివారు ఇలా అందరూ ఇబ్బందులు పడుతుంటారు. గురక సమస్యను హీరోకు పెట్టి, దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ విజయం సాధించాడు. సినిమా మొదలవగానే హీరోకు గురక ఉందని అర్థమవుతుంది. గురకతో హీరో చుట్టు పక్కల వాళ్ళు పడే ఇబ్బందులను దర్శకుడు చక్కగా చూపించాడు. ఇక వాళ్లు అనే మాటలు నవ్విస్తాయి.

Also Read: “చిరంజీవి” కూతురు “సుస్మిత” హీరోయిన్ గా నటించిన సినిమా ఏదో తెలుసా..?


End of Article

You may also like