తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా అడుగుపెట్టి, చిన్న చిన్న పాత్రలు చేస్తూ అంచలంచలుగా మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. చాలా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చి, మంచి సక్సెస్ అందుకుని టాలీవుడ్ లో కొనసాగుతున్నారు.

Video Advertisement

అలా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విజయాన్ని అందుకున్నారు. అయితే మెగా డాటర్స్ మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోయారు. మెగా డాటర్ నిహారిక కొన్ని సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత హీరోయిన్ గా నటించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ మూవీ ఏమిటో ఇప్పుడు చూద్దాం.. chiranjeevi-daughter-sushmitaమెగా ఫ్యామిలీ నుండి నాగబాబు డాటర్ నిహారిక యాంకర్ గా సినీ పరిశ్రమ అడుగు పెట్టింది. ఆ తరువాత హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించారు. కానీ నిహారిక నటించిన చిత్రాలు అంతగా విజయం సాధించలేదు. దాంతో ఆమె నిర్మాతగా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. నిహారిక సినిమాలు నిర్మిస్తూ, అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ప్రస్తుతం ఇండస్ట్రీలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతూ, ఆ తరువాత ప్రొడ్యూసర్ గా స్థిరపడ్డారు. అయితే సుస్మిత గతంలో ఒక సినిమాలో హీరోయిన్ గా నటించిందంట. చిరంజీవి సుస్మితను హీరోయిన్ పరిచయం చేయాలని అనుకున్నారంట. కానీ సుస్మితను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి వస్తుండడంతో ఆ ఆలోచనను చిరంజీవి పక్కకు పెట్టారని సమాచారం. సుస్మిత హీరోయిన్ గా ఒక చిత్రంలో నటించారట. అయితే ఆ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడంతో రిలీజ్ కు నోచుకోలేదు. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉదయ్ కిరణ్, సుస్మిత జంటగా  నటించారట. ఈ మూవీ మొదటి సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నది. అయితే సెకండ్ హాఫ్ షూటింగ్ కంప్లీట్ కాలేదంట.  దాంతో ఆ మూవీ రిలీజ్ కాలేదని తెలుస్తోంది.

Also Read: “అల్లు అర్జున్ – త్రివిక్రమ్” సినిమా కథ ఇదేనా..? ఈసారి ఇలా ఆలోచించారా..?