ఈ వీడియోలో పాట పాడుతున్న పాప ఇప్పుడు చాలా పెద్ద హీరోయిన్ అయ్యింది..! ఎవరో కనిపెట్టగలరా..?

ఈ వీడియోలో పాట పాడుతున్న పాప ఇప్పుడు చాలా పెద్ద హీరోయిన్ అయ్యింది..! ఎవరో కనిపెట్టగలరా..?

by Mohana Priya

Ads

సాధారణంగా సినిమాల్లో నటించే వాళ్ళకి నటనతో పాటు ఇంకా చాలా కళలు వచ్చి ఉంటాయి. కొంత మంది దర్శకులు అవుతారు. కొంత మంది ప్రొడ్యూసర్స్ అవుతారు. కొంత మంది మంచి డాన్సర్ అయ్యి ఉంటారు. కొంత మంది మంచి రైటర్స్ అయ్యి ఉంటారు. మరి కొంత మంది మంచి సింగర్స్ కూడా అయ్యి ఉంటారు. ఇలా కేవలం నటించడం మాత్రమే కాకుండా మిగిలిన కళల్లో కూడా నైపుణ్యం ఉన్న మల్టీ టాలెంటెడ్ నటులు ఎంతో మంది ఉన్నారు. వారిలో కొంత మంది సినిమాల్లోకి వచ్చాక వారిలోని మరొక టాలెంట్ బయటికి తీస్తే, కొంత మంది మాత్రం సినిమాల్లోకి రాకముందే వాళ్లలో ఉన్న టాలెంట్ ని ప్రేక్షకులకు పరిచయం చేసి ఉంటారు.

Video Advertisement

did you recognize this singer and heroine

అలా పైన ఉన్న అమ్మాయి చిన్నతనంలో చాలా బాగా పాడేది. ఇప్పుడు పెద్దయ్యాక చాలా పెద్ద నటి అయ్యింది. నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు నజ్రియా నజీమ్. నజ్రియా చిన్నప్పటినుండి సినిమాల్లో ఉన్నారు. నజ్రియా చిన్నప్పుడు పాటలు కూడా పాడారు. ఈ వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి. నజ్రియా పాడే విధానం చూస్తే తను పాడడాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో అనేది అర్థం అవుతుంది. నజ్రియా అప్పట్లో ఫేమస్ అయిన ఎన్నో సినిమా పాటలు స్టేజ్ మీద షోస్ లో పాడారు. ఆ తర్వాత హీరోయిన్ అయ్యారు.

అప్పుడు కూడా చాలా సందర్భాల్లో పాటలు పాడారు. నజ్రియా మంచి నటి మాత్రమే కాదు. మంచి సింగర్ కూడా. డాన్స్ కూడా చాలా బాగా చేస్తారు. మలయాళం లో నజ్రియాని ఎక్స్ప్రెషన్ క్వీన్ అని అంటారు. నజ్రియా మల్టీ టాలెంటెడ్ అని ఇవన్నీ చూస్తే తెలుస్తోంది. ఇటీవల ఆవేశం సినిమాతో ప్రొడ్యూసర్ గా కూడా మారారు. నజ్రియా సినిమాల్లోకి వచ్చి చాలా కాలం అయ్యింది. మధ్యలో కొంత కాలం బ్రేక్ తీసుకొని సినిమాలు చేశారు. అయినా కూడా ఇప్పటికీ ఆమెకి ఉన్న అభిమానులు ఏమాత్రం తగ్గలేదు. అంటే ఆమె ఎంత టాలెంటెడ్ నటి అనేది మనమే అర్థం చేసుకోవాలి.


End of Article

You may also like