Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంవత్సరంలో ఎంతోమంది నటీనటులు పరిచయం అవుతారు. వారిలో కొంతమంది హీరోలు కూడా ఉన్నారు. అలా చాలా సంవత్సరాల క్రితం పరిచయం అయిన ఒక యంగ్ హీరో లుక్ ఒకటి ఏంటంటే ప్రస్తుతం వైరల్ అవుతోంది. వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన లాహిరి లాహిరి లాహిరి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటుడు ఆదిత్య ఓం.
Video Advertisement
తను నటించిన ఫస్ట్ మూవీ తోనే సక్సెస్ అందుకున్న ఆదిత్య తరువాత ధనలక్ష్మి ఐ లవ్ యు, ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలీదు, మీ ఇంటికివస్తే ఏమి ఇస్తారు మా ఇంటికి వస్తే ఏమి తెస్తారు లాంటి ఎన్నో మూవీస్ లో నటించాడు. తన వైవిద్యమైన నటనతో మంచి పేరు అందుకున్న ఆదిత్య ఓం తాజాగా నటించిన సినిమా దహనం. అదారి మూర్తి సాయి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే ఎంతో మంది ప్రశంసలను అందుకుంది.
ఈ సినిమా కు రెండు బెస్ట్ యాక్టర్ అవార్డులు కూడా వచ్చాయి. “రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క ప్రతిష్టాత్మక ఎనిమిదో ఎడిషన్‌లో ప్రాంతీయ చలనచిత్ర విభాగంలో నేను ఒక అవార్డును అందుకున్నాను” అని తనకు అందిన పురస్కారం గురించి అందరితో గర్వంగా పంచుకున్నాడు ఆదిత్య. అంతే కాకుండా ముంబైలోని ప్రైమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా అతనికి మరో అవార్డు వచ్చింది. ఈ దహనం చిత్రం 1980ల నాటి కథ మీద ఆధారపడి ఉంటుంది.
ఈ మూవీ కోసంఆదిత్య ఓం టోటల్ మేక్ ఓవర్ చెందాడు అని చెప్పవచ్చు. ఆదిత్య తన పాత్ర కోసం ప్రత్యేకించి సుదీర్ఘమైన సంస్కృత శ్లోకాలను మరియు అన్ని పూజారి ఆచారాలను కూడా నేర్చుకున్నాడు. ఈ మూవీ లో ఆదిత్య ఓం ఓల్డ్ గెటప్‌లో ఇది వరకు ఎన్నడూ కనిపించని విధంగా ఉన్నారు. పురాతన ఆలయాన్ని పరిరక్షించే రక్షకుడిగా కనిపిస్తున్నారు. ఆదిత్య ను ఆ గెటప్ లో చూసిన వాళ్ళు అసలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు అని అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఈ చిత్రంలో ఆదిత్య తన నటనతో అందరిని మెప్పించాడు.
End of Article