Ads
టోల్ గేట్ ల గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే.. జాతీయ రహదారులపైన ప్రయాణించేటప్పుడు ప్రతి 70 కిలోమీటర్లకు టోల్ ప్లాజా ఉంటుంది. ఆ బారికేడ్ దాటి వెళ్ళడానికి టోలు కట్టి వెళ్లాల్సి ఉంటుంది. అయితే.. తాజాగా టోల్ గేట్ ల వద్ద ఎక్కువ సమయం వృధా చేయకుండా ఉండేందుకు కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ను తీసుకొచ్చింది.
Video Advertisement
టోల్ గేట్ ల వద్ద ప్రయాణికులను తొందరగా పంపించడం కోసమే ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఒక్కో వాహనం వద్దా పది సెకండ్ల కంటే ఎక్కువ సమయం పట్టకూడదు అని కొత్త గా జారీ చేయబడ్డ గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. అలాగే టోల్ గేట్ ల వద్ద ఎక్కువ వాహనాల రద్దీ ఉండకూడదు. వెంట వెంటనే వాహనాల్ని పంపుతూ ఉండాలి.
తాజా పాలసి ప్రకారం , టోల్ గేట్ కు వంద మీటర్ల దూరం లో ఓ ఆకుపచ్చని గీతను గీస్తారు. అంటే.. వంద మీటర్ల తరువాత ఎలాంటి వాహనాలు ఆగకూడదు. అంటే ఎక్కువ రద్దీ అవ్వకుండా.. టోల్ గేట్ వద్ద పని చేసే సిబ్బంది రెస్పానిస్బిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వంద మీటర్ల తరువాత వాహనాలు ఆగి ఉంటె.. వారి నుంచి ఎలాంటి టోల్ ను వసూలు చేయకుండా పంపించేయాల్సి ఉంటుంది. దీని ద్వారా సిబ్బంది బాధ్యతాయుతం గా పనిచేసేలా చేయడం.. మరో వైపు వాహనదారుల ఇక్కట్లను గట్టెక్కించడం కూడా సాధ్యం అవుతుంది.
End of Article