మీరు టూత్ పేస్ట్ కరెక్ట్ గానే వాడుతున్నారా..? టీవీలో చూపించినట్టు ఆ తప్పు చేయకండి..!

మీరు టూత్ పేస్ట్ కరెక్ట్ గానే వాడుతున్నారా..? టీవీలో చూపించినట్టు ఆ తప్పు చేయకండి..!

by Anudeep

Ads

మీ టూత్ పేస్ట్లో ఉప్పుందా ? మీ టూత్ పేస్టులో బొగ్గుందా ? అంటూ సినిమా హీరోయిన్స్ , మోడల్స్ అడిగే సరికి కంగారు పడిపోయి , ఎడాపెడా టూత్ పేస్టలని వాడేస్తున్నారా ? పేస్టుతో బ్రెష్ చేసుకో , ఇంత కొంచెమేనా , బ్రష్ నిండుగా పేస్ట్ పెట్టుకో అంటూ కిలో కిలోలు పేస్టు పెట్టేసుకుంటున్నారా ? మీ టూత్ పేస్ట్ లో ఉప్పున్నా లేకపోయినా పర్లేదు . కానీ టూత్ పేస్ట్ వాడే విషయంలో మాత్రం మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాల్సిందే .

Video Advertisement

ఉదయం లేవగానే బ్రష్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన పనే . దానికోసం పేస్ట్ వాడడం కూడా మంచిదే కానీ ఎంత పేస్ట్ వాడాలన్నదే అసలైన సమస్య . టివిల్లో యాడ్ చూడగానే బ్రష్ నిండుగా పెట్టుకుని వాడేస్తుంటాం . కొందరైతే ఒకసారి మాత్రమే కాదు రెండు సార్లు పెట్టుకుని చేస్తుంటారు . కానీ ఈ పేస్ట్ చిన్నపిల్లలకి హానికరం అని మీకు తెలుసా? ఆకలి వేయకుండా చేస్తుందని మీలో ఎంతమందికి తెలుసు?

చిన్నపిల్లలు పేస్ట్ టేస్టీగా ఉందని చప్పరిస్తుంటారు . పెద్దవాళ్లు వారించినప్పటికి వారు వినరు . కానీ పేస్ట్ పరిమాణం విషయంలో మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి . కావాలంటే ఈ సారి టూత్ పేస్ట్ తెచ్చుకున్నప్పుడు కవర్ పైన ఏముందో చదవండి . పిల్లల పట్ల జాగ్రత్త తీస్కోండి.


End of Article

You may also like