రైలు ప్రయాణం ఎవరికైనా అందమైనదే.. అందరూ ట్రైన్ జర్నీని ఆస్వాదిస్తారు. దేశంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి ఇదే ఉత్తమ సాధనం. తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అంతే కాకుండా సుఖ వంతంగా ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. అందుకే లాంగ్ జర్నీ లు అయినా.. సాధారణ ప్రయాణాలు అయినా చాలా మంది ట్రైన్ జర్నీ కే ఓటేస్తారు.

Video Advertisement

 

అయితే ఇండియన్ రైల్వేస్‌ను దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్ను అని చెప్పొచ్చు. నిత్యం లక్షల మంది రైల్వే ప్రయాణం చేస్తుంటారు. ఇతర మార్గాల్లో ప్రయాణం కన్నా ట్రైన్ జర్నీ బాగుంటుందని చాలా మంది భావిస్తారు. అందుకే ముందుగానే టికెట్లను బుక్ చేసుకొంటూ ఉంటారు.

useful apps for train passengers..
అయితే ఈ జర్నీ లని మరింత సులభతరం చేయడానికి కొన్ని అప్స్ ఉన్నాయి.. అవి ప్రత్యేకించి రైలు ప్రయాణికుల కోసమే.. ఇప్పుడా యాప్స్ ఏవో చూసేద్దాం..

#1 ఐఆర్సీటీసీ కనెక్ట్

useful apps for train passengers..
ఈ యాప్ ద్వారా దేశం లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ బుక్ చేసుకొనే సదుపాయం కూడా ఉంది. కేవలం రైల్ కాకుండా బస్సు, విమాన టికెట్లు, హోటల్ రూమ్స్ బుకింగ్ వంటి సదుపాయాలు కూడా ఈ యాప్ లో ఉన్నాయి.
#2 జూప్

useful apps for train passengers..
ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టిన ఈ యాప్ ద్వారా మీకు నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. వారు నేరుగా మీకు ట్రైన్ లోకే డెలివరీ ఇస్తారు.
#3 యుటీఎస్

useful apps for train passengers..
ఆన్ రెసెర్వెడ్ టిక్కెటింగ్ సిస్టం (యుటీఎస్) యాప్ ద్వారా రిజర్వేషన్ లేని సెకండ్ క్లాస్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
#4 ఎన్టీఈఎస్

useful apps for train passengers..
నేషనల్ ట్రైన్ ఎంక్వయిరీ సిస్టం యాప్ ద్వారా రైళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ట్రైన్ స్టేటస్ కూడా చెక్ చెయ్యొచ్చు.
#5 రైల్ సుగం

useful apps for train passengers..
రైలు మార్గం లో సరకులు ఎగుమతి, దిగుమతి చేసుకొనే వ్యాపారస్తులకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. సరకు రవాణా ఖర్చు, రైలు ఎక్కడ ఉంది అనే వివరాలు ఇందులో తెలుసుకోవచ్చు.
#6 రైల్ మదద్

useful apps for train passengers..
రైల్వే శాఖకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే ఈ యాప్ లో చెయ్యొచ్చు. అంతే కాకుండా వాటిని ట్రాక్ కూడా చెయ్యొచ్చు.
#7 ఐఆర్పీఎస్ఎం

useful apps for train passengers..
ఇండియన్ రైల్వేస్ ప్రాజెక్ట్స్, శాంక్షన్స్ మానేజ్మెంట్ యాప్ ద్వారా రైల్వే ప్రోజెక్టుల వివరాలు తెలుసుకోవచ్చు. ఒక ప్రాజెక్ట్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, శాఖ ఇచ్చిన నిధులు వంటి వాటి గురించి తెలుసుకోవచ్చు.
#8 రైల్ సారధి

useful apps for train passengers..
భారతీయ రైల్వే కి సంబంధించిన అన్ని యాప్స్ అందించే సేవలు ఈ యాప్ లో లభిస్తాయి.