Ads
తమిళ్ హీరోలకి తెలుగు ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బింగ్ సినిమాలను కూడా చాలా వరకు మన తెలుగు సినిమాలతో సమానంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇంక సూర్య సినిమాలు వస్తే మాత్రం ఒక తెలుగు సినిమాలాగానే చూస్తారు.
Video Advertisement
సూర్య మాత్రమే కాకుండా, మరి కొంతమంది తమిళ్ హీరోలు అయిన విజయ్, అజిత్, అలాగే సీనియర్ హీరోలు అయిన కమల్ హాసన్, రజనీకాంత్ కి కూడా తెలుగులో చాలా మంచి క్రేజ్ ఉంది. ఈ మధ్య చాలా మంది తమిళ హీరోలు కూడా డైరెక్ట్ తెలుగు సినిమాలతో ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇలాగే అంతకు ముందు కూడా ఒక తమిళ హీరో ఒక తెలుగు సినిమాలో నటించారు. ఆ హీరోనే వినయ్ రాయ్.
వినయ్ వాన సినిమాలో హీరోగా నటించారు. సినిమాకి ఎమ్మెస్ రాజు వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేదు. కానీ పాటలు మాత్రం చాలా హిట్ అయ్యాయి. ఇప్పటికి కూడా ఈ సినిమా పాటలకు చాలా క్రేజ్ ఉంది. వినయ్ చాలా తమిళ సినిమాల్లో నటించారు. వినయ్ హీరోగా నటించిన ఒక తమిళ్ సినిమా తెలుగులో నీవల్లే నీవల్లే పేరుతో డబ్ అయ్యింది. తెలుగులో వినయ్ నటించింది ఒక్క సినిమానే అయినా కూడా పాటలు బాగా హిట్ అవ్వడం వల్ల చాలా మంది తెలుగు ప్రేక్షకులకి గుర్తున్నారు.
అయితే తర్వాత చాలా కాలం వరకు వినయ్ కనిపించలేదు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ఇలాగే డబ్బింగ్ సినిమాలతో వినయ్ ఎంట్రీ ఇచ్చారు. విశాల్ హీరోగా నటించిన డిటెక్టివ్ సినిమాలో వినయ్ ఒక విలన్ గా నటించారు. అలాగే శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాలో కూడా నెగటివ్ పాత్రలో నటించారు. డాక్టర్ సినిమా తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి హిట్ అయ్యింది. దాంతో ఈ సినిమాలో నటించిన వినయ్ కి కూడా మంచి పేరు వచ్చింది.
End of Article