Ads
పెళ్లికి మండపం రెడీ అయిపోయింది . బంధువులంతా వచ్చేశారు . పెళ్లికొడుకు , పెళ్లి కూతురు మండపంలో కూర్చున్నారు . ఇరువైపుల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి . మరికాసేపట్లో వివాహఘట్టం ముగియనుంది . ఇంతలో హఠాత్తుగా ఆపండి అంటూ కేక వినపడింది . ఇదేదో సినిమా సీన్ కాదండీ , రియల్ గా జరిగిన ఘటన . ఇలాంటివి సినిమాల్లోనే జరుగుతుంటాయి . నిజజీవితంలో చాలా అరుదు . కానీ వనపర్తి జిల్లాలో ఒక వివాహవేడుకలో వధువు లవర్ చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయేలా చేశాడు. వివరాల లోకి వెళ్తే…
Video Advertisement
వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన ఓ యువతికి తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు . కూతురు పెళ్లికి బంధువులందరిని ఆహ్మానించారు . పెళ్లి పనులు పూర్తి చేసుకున్నారు . పెళ్లి జరిగిపోతుంది ,కూతురు అత్తవారింటికి వెళ్లిపోతుంది , అంతా సంతోషంగా ముగుస్తుంది అనుకున్నారు . కానీ సరిగ్గా తాళి కట్టే ముహుర్తానికి ఎక్కడినుండో ఊడిపడ్డట్టు , ఒక కుర్రాడు వచ్చి పెళ్లిని ఆపమన్నాడు , వెంటనే పెళ్లికూతురు కూడా లేచి అతని దగ్గరికి వెళ్లి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదంటూ మండపంలోనే బంధువులందరి ముందు చెప్పింది .
అయితే వధువు తల్లిదండ్రులు , కుటుంబంతో సహా కొద్ది రోజులు షోలాపూర్లో నివాసం ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడే యువతికి ఒక యువకుడితో పరిచయం అయింది. అది ప్రేమగా మారింది. తెలుసుకున్న తల్లితండ్రులు. ఆ ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో తమ మకాం మార్చేశారు. షోలాపూర్ నుండి వచ్చి వనపర్తిలో నివాసం ఉంటూ , కూతురి పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు . అంతా సవ్యంగా జరిగిపోతుందనుకున్న టైంలో ఎదురైన పరిణామానికి హతాశులయ్యారు.
పెళ్లి ఆగిపోయిందనే బాధ ఒకవైపు, బంధువులందరి ముందు పరువు పోయిందనే ఆవేదన మరోవైపు. దీంతో వెంటనే యువతి తరపు వాళ్లందరూ ఆ అబ్బాయి పైకి దాడికి దిగారు . అక్కడే ఉండడం మంచిది కాదనుకున్న భగ్న ప్రేమికుడు, బతికుంటే మళ్లీ ప్రేమించుకోవచ్చు అనుకున్నాడో ఏమో. ముందు ప్రాణాలు, తర్వాతే ప్రేమ అనుకుని అక్కడి నుండి పారిపోయాడు . అది మొత్తానికి ప్రేమికుడు పారిపోయాడు, చుట్టాలు వెళ్లిపోయారు, చివరికి పెళ్లి ఆగిపోయింది.
End of Article