జీలకర్ర బెల్లం పెట్టే టైం కి వరుడికి పెద్ద ట్విస్ట్ ఇచ్చిన వధువు..! చివరికి ఏమైందంటే.?

జీలకర్ర బెల్లం పెట్టే టైం కి వరుడికి పెద్ద ట్విస్ట్ ఇచ్చిన వధువు..! చివరికి ఏమైందంటే.?

by Anudeep

Ads

పెళ్లికి మండపం రెడీ అయిపోయింది . బంధువులంతా వచ్చేశారు . పెళ్లికొడుకు , పెళ్లి కూతురు మండపంలో కూర్చున్నారు . ఇరువైపుల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి . మరికాసేపట్లో వివాహఘట్టం ముగియనుంది . ఇంతలో హఠాత్తుగా ఆపండి అంటూ కేక వినపడింది . ఇదేదో సినిమా సీన్ కాదండీ , రియల్ గా జరిగిన ఘటన . ఇలాంటివి సినిమాల్లోనే జరుగుతుంటాయి . నిజజీవితంలో చాలా అరుదు . కానీ వనపర్తి జిల్లాలో ఒక వివాహవేడుకలో వధువు లవర్ చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయేలా చేశాడు. వివరాల లోకి వెళ్తే…

Video Advertisement

వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన ఓ యువతికి తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు . కూతురు పెళ్లికి బంధువులందరిని ఆహ్మానించారు . పెళ్లి పనులు పూర్తి చేసుకున్నారు . పెళ్లి జరిగిపోతుంది ,కూతురు అత్తవారింటికి వెళ్లిపోతుంది , అంతా సంతోషంగా ముగుస్తుంది అనుకున్నారు . కానీ సరిగ్గా తాళి కట్టే ముహుర్తానికి ఎక్కడినుండో ఊడిపడ్డట్టు , ఒక కుర్రాడు వచ్చి పెళ్లిని ఆపమన్నాడు , వెంటనే పెళ్లికూతురు కూడా లేచి అతని దగ్గరికి వెళ్లి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదంటూ మండపంలోనే బంధువులందరి ముందు చెప్పింది .

అయితే వధువు తల్లిదండ్రులు , కుటుంబంతో సహా కొద్ది రోజులు షోలాపూర్లో నివాసం ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడే యువతికి ఒక యువకుడితో పరిచయం అయింది. అది ప్రేమగా మారింది. తెలుసుకున్న తల్లితండ్రులు. ఆ ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో తమ మకాం మార్చేశారు. షోలాపూర్ నుండి వచ్చి వనపర్తిలో నివాసం ఉంటూ , కూతురి పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు . అంతా సవ్యంగా జరిగిపోతుందనుకున్న టైంలో ఎదురైన పరిణామానికి హతాశులయ్యారు.

పెళ్లి ఆగిపోయిందనే బాధ ఒకవైపు, బంధువులందరి ముందు పరువు పోయిందనే ఆవేదన మరోవైపు. దీంతో వెంటనే యువతి తరపు వాళ్లందరూ ఆ అబ్బాయి పైకి దాడికి దిగారు . అక్కడే ఉండడం మంచిది కాదనుకున్న భగ్న ప్రేమికుడు, బతికుంటే మళ్లీ ప్రేమించుకోవచ్చు అనుకున్నాడో ఏమో. ముందు ప్రాణాలు, తర్వాతే ప్రేమ అనుకుని అక్కడి నుండి పారిపోయాడు . అది మొత్తానికి  ప్రేమికుడు పారిపోయాడు, చుట్టాలు వెళ్లిపోయారు, చివరికి పెళ్లి ఆగిపోయింది.


End of Article

You may also like