Ads
ఆడవారికి ఆడవాళ్లే శత్రువులు అని చాలా సందర్భాలలో అంటూ ఉంటాం.. అలంటి పరిస్థితి నిత్య జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. తన సొంత వదిన కారణం గానే ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం లో చోటు చేసుకుంది. ఎస్సై నందిగామ నాగనాధ్ తెలిపిన వివరాలు ఈ విధం గా ఉన్నాయి.
Video Advertisement
image credits: News18
asianetnewstelugu కథనం ప్రకారం హర్కాపూర్ గ్రామానికి చెందిన శ్రీదేవి, అరవింద్ అన్నా చెల్లెల్లు. పది సంవత్సరాల క్రితమే వారి తల్లి తండ్రులు ఈ లోకాన్ని వీడారు. అప్పటి నుంచి చెల్లెలు శ్రీదేవి బాధ్యతను అరవింద్ తీసుకున్నాడు. కొంతకాలానికి, తన మేనత్త జాదవ్ సెవంతబాయి కుమార్తె మంజులతో అరవింద్ వివాహం జరిగింది. సెవంతబాయి జగిత్యాల జిల్లా గొర్రెపల్లి గ్రామ నివాసి. అయితే.. వివాహం అయ్యాకా సంపాదన నిమిత్తం అరవింద్ దుబాయికి వెళ్ళాడు. చెల్లెలు శ్రీదేవి, భార్య మంజుల కు తోడు గా ఉండాల్సిందని అత్త సెవంతబాయి ని కూడా హర్కాపూర్ కు వచ్చి ఉండాల్సింది గా అరవింద్ కోరాడు.
అయితే.. అప్పటికి శ్రీదేవి డిగ్రీ మొదటి సంవత్సరం మాత్రమే పూర్తి చేసింది. అయితే ఆమెను పోషించడం అరవింద్ భార్య మంజులకు, అత్త కు నచ్చలేదు. ఆమెను సూటిపోటి మాటలతో వేధించేవారు. ఆమెకు పెళ్లి చేయాలంటే కట్నం ఇవ్వాలి.. పెళ్ళికి ఖర్చులు కూడా అవుతుంటాయి అని వేధించేవారు.ఆమెను ఎవరితోనైనా లేచిపోవాలంటూ సలహాలిచ్చేవారు. మరో వైపు కరోనా లాక్ డౌన్ కారణం గా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అరవింద్ ఈ ఏడాది జనవరి లో ఇండియా కి వచ్చేసాడు.
తన చెల్లిని వేధిస్తున్న విషయమై అరవింద భార్య మంజులతోను, అత్తతోను గొడవపడ్డాడు. ఈ క్రమం లో మంజుల తల్లితో పాటు పుట్టింటికెళ్ళిపోయింది. ఆ తరువాత నీ వల్లే మేము విడిపోయాము అంటూ శ్రీదేవి ని సూటిపోటి మాటలతో ఫోన్ చేసి వేధించసాగింది. నీ అన్నతో నువ్వే సంసారం చేసుకో అంటూ ఆమె మాటలతో వేధించి బాధించడం తో.. మనస్తాపం చెందిన శ్రీదేవి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఆసుపత్రికి చేర్చేలోపే ఆమె ప్రాణాలు వీడింది. అరవింద్ ఫిర్యాదు మేరకు మంజుల, ఆమె తల్లిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
End of Article