Ads
మనకి ఏదైనా కష్టం వచ్చిన దానికన్నా , మనకి కావలసిన వాళ్లు కష్టాల్లో ఉన్నారని తెలిసినప్పుడు కలిగే బాధ ఎక్కువ . అది తల్లిపిల్లల విషయంలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది . ఏ తల్లైనా తనెన్ని కష్టాలైనా పడడానికి సిధ్దపడ్తుంది కాని బిడ్డలు చిన్న బాధ పడినా తట్టుకోలేదు . అందుకే ప్రపంచంలో అమ్మ ప్రేమది ప్రత్యేక స్థానం . కేవలం మనుషుల్లోనే కాదు నోరు లేని మూగ జీవులు సైతం తమ పిల్లలకి ఏదైనా ఆపద వస్తే ప్రాణాలకు తెగించి మరీ రక్షించుకుంటారు . అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ వడ్రంగి పిట్ట స్టోరీ.
Video Advertisement
అవతల వాళ్లు ఎంత బలవంతులైనప్పటికి తన బిడ్డ జోలికొస్తే ఏ తల్లి ఊరుకోదు . ఒక వడ్రంగి పిట్ట కూడా తన బిడ్డల జోలికొచ్చిన విషసర్పంతో యుద్దానికి దిగింది . తన బిడ్డల్ని రక్షించుకుంది . సోషల్ మీడియాలో వైరలైన వడ్రంగి పిట్ట వీడియో నెటిజన్లను అబ్బురపరుస్తుంది.
ఒక వడ్రంగి పిట్ట చెట్టు తొర్రలో గుడ్లను పెట్టింది . ఆహారం కోసం బయటికి వెళ్లింది . దీన్ని గమనించిన ఒక పాము మెల్లిగా చెట్టుపైకి పాకి మెల్లిగా తొర్రలోకి ప్రవేశించింది. కాసేపటికి అక్కడికి చేరుకున్న వడ్రంగి పిట్ట తన గుడ్లను తినేస్తుందని భయపడింది . కానీ పదడుగుల విషపు సర్పాన్ని చూసి వెనక్కి తగ్గలేదు . నోటితో పదేపదే పామును పొడిచింది . తొర్రలోనుండి బయటికి వచ్చిన పాము నోట కరచి వడ్రంగి పిట్టని విసిరికొట్టింది . ఇలా రెండింటి మధ్య కాసేపు చిన్నపాటి యుధ్దమే జరిగింది. పదేండ్ల క్రితం జరిగిన ఈ ఘటన తాలుకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .
All the forces on this planet, will never beat that of a mothers love.
Wood pecker saving its chicks after a fierce air duel with the snake pic.twitter.com/mvBo7OWN74— Susanta Nanda IFS (@susantananda3) March 1, 2020
ప్రపంచంలో తల్లిని మించిన యోదులు ఎవ్వరూ లేరనేది అక్షరాల నిజం . ఈ వీడియో చూస్తే మీకే అర్దం అవుతుంది . వీడియో చూసిన నెటిజన్ ఒకరు కన్నీరు ఆపుకోలేకపోయానంటూ కామెంట్ చేస్తే , మరొకరు అమేజింగ్ అంటూ కామెంట్ చేశారు . గంటకుపైగా ఫైట్ చేసినప్పటికి పాము కాటుకి బలై ఆ వడ్రంగి పిట్ట చనిపోవడం విషాదం . నెటిజన్ల చేత కన్నీరు పెట్టిస్తున్న వడ్రంగి పిట్ట వీడియో మీరూ చూడండి.
End of Article