• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

తల్లిప్రేమ అంటే ఇదే….పది అడుగుల పాముతో వడ్రంగిపిట్ట పోరాటం.! వైరల్ వీడియో!!!

Published on March 3, 2020 by Anudeep

మనకి ఏదైనా కష్టం వచ్చిన దానికన్నా , మనకి కావలసిన వాళ్లు కష్టాల్లో ఉన్నారని తెలిసినప్పుడు కలిగే బాధ ఎక్కువ . అది తల్లిపిల్లల విషయంలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది . ఏ తల్లైనా తనెన్ని కష్టాలైనా పడడానికి సిధ్దపడ్తుంది కాని బిడ్డలు చిన్న బాధ పడినా తట్టుకోలేదు . అందుకే ప్రపంచంలో అమ్మ ప్రేమది ప్రత్యేక స్థానం . కేవలం మనుషుల్లోనే కాదు నోరు లేని మూగ జీవులు సైతం తమ పిల్లలకి ఏదైనా ఆపద వస్తే ప్రాణాలకు తెగించి మరీ రక్షించుకుంటారు . అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ వడ్రంగి పిట్ట స్టోరీ.

అవతల వాళ్లు ఎంత బలవంతులైనప్పటికి తన బిడ్డ జోలికొస్తే ఏ తల్లి ఊరుకోదు . ఒక వడ్రంగి పిట్ట కూడా తన బిడ్డల జోలికొచ్చిన విషసర్పంతో యుద్దానికి దిగింది . తన బిడ్డల్ని రక్షించుకుంది . సోషల్ మీడియాలో వైరలైన వడ్రంగి పిట్ట వీడియో నెటిజన్లను అబ్బురపరుస్తుంది.

ఒక వడ్రంగి పిట్ట చెట్టు తొర్రలో గుడ్లను పెట్టింది . ఆహారం కోసం బయటికి వెళ్లింది . దీన్ని గమనించిన ఒక పాము మెల్లిగా చెట్టుపైకి పాకి మెల్లిగా తొర్రలోకి ప్రవేశించింది. కాసేపటికి అక్కడికి చేరుకున్న వడ్రంగి పిట్ట తన గుడ్లను తినేస్తుందని భయపడింది . కానీ పదడుగుల విషపు సర్పాన్ని చూసి వెనక్కి తగ్గలేదు . నోటితో పదేపదే పామును పొడిచింది . తొర్రలోనుండి బయటికి వచ్చిన పాము నోట కరచి వడ్రంగి పిట్టని విసిరికొట్టింది . ఇలా రెండింటి మధ్య కాసేపు  చిన్నపాటి యుధ్దమే జరిగింది. పదేండ్ల క్రితం జరిగిన ఈ ఘటన తాలుకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

All the forces on this planet, will never beat that of a mothers love.
Wood pecker saving its chicks after a fierce air duel with the snake pic.twitter.com/mvBo7OWN74

— Susanta Nanda IFS (@susantananda3) March 1, 2020

ప్రపంచంలో తల్లిని మించిన యోదులు ఎవ్వరూ లేరనేది అక్షరాల నిజం . ఈ వీడియో చూస్తే మీకే అర్దం అవుతుంది . వీడియో చూసిన నెటిజన్ ఒకరు కన్నీరు ఆపుకోలేకపోయానంటూ కామెంట్ చేస్తే , మరొకరు అమేజింగ్ అంటూ కామెంట్ చేశారు . గంటకుపైగా ఫైట్ చేసినప్పటికి పాము కాటుకి బలై ఆ వడ్రంగి పిట్ట చనిపోవడం విషాదం . నెటిజన్ల చేత కన్నీరు పెట్టిస్తున్న వడ్రంగి పిట్ట వీడియో మీరూ చూడండి.


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • “MI గెలుపు RCB ప్లేఆఫ్స్‌కి వచ్చిందిగా.?” అంటూ… MI vs DC మ్యాచ్‌కి ముందు ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్..!
  • RRR లో “మల్లి”గా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?
  • “ఇలా చేస్తే నేను ఏం చేయాలి..?” అంటూ… వైరల్ అవుతున్న ఒక యువకుడి “పెళ్లిచూపుల” ట్వీట్..! నెటిజన్ల రిప్లైలు అయితే ఇంకా హైలైట్..!
  • రిలీజ్ అయినప్పుడు ఈ 5 సినిమాలని ప్లాప్ అన్నారు…కానీ చివరికి కోట్లల్లో కలెక్షన్స్ కొల్లగొట్టాయి.!
  • నైట్ డ్రెస్ వేసుకొని రెస్టారెంట్ కి వచ్చావ్ ఏంటి జాన్వీ అంటూ…శ్రీదేవి కూతురుపై ట్రోల్ల్స్.!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions