“వైశాలి” 5-6 లక్షలు తీసుకుంది..! మేజిస్ట్రేట్ ముందు “నవీన్ రెడ్డి” లాయర్..!

“వైశాలి” 5-6 లక్షలు తీసుకుంది..! మేజిస్ట్రేట్ ముందు “నవీన్ రెడ్డి” లాయర్..!

by Anudeep

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ లో ఒక యువతిని వందమంది దాడి చేసి కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో ఆరు గంటల్లోనే ఆ యువతిని కాపాడారు పోలీసులు. ఈ కేసు లో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేసారు. ఈ కేసు లో ఇప్పటికే 32 మందిని అరెస్టు చేసారు.

Video Advertisement

 

తాజాగా ఈ కేసులో ఆసక్తికర అంశాలు బయట పడుతున్నాయి. నవీన్ రెడ్డి ఒక 58 నిమిషాల నిడివి గల వీడియో ని విడుదల చేయడం తో దానిపై మేజిస్ట్రేట్ ముందు విచారణ జరుగుతోంది. శుక్రవారం రోజు మరోసారి మెజిస్ట్రేట్ ముందు నవీన్ రెడ్డిని పోలీసులు హాజరుపర్చగా.. అతని తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలో.. వైశాలి నవీన్ రెడ్డి దగ్గర నుంచి ఐదారు లక్షల డబ్బు తీసుకుని వాడుకుందని లాయర్ వివరించారు.

interesting twist in manneguda kidnap case..!!

నవీన్ రెడ్డి ని పోలీసులు ఇప్పటికే ఓసారి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా.. కస్టడీ కోరుతూ మరో సారి ధర్మాసనం ముందు హాజరు పరిచారు. ఈ క్రమం లో ఈ కేసు లో 307 వర్తించదంటూ నవీన్ రెడ్డి తరపు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇద్దరి మధ్య పరిచయం, స్నేహం వంటి సంఘటనలను న్యాయవాది మేజిస్ట్రేట్ కి వివరించారు.

interesting twist in manneguda kidnap case..!!

నవీన్ వైశాలిని కిడ్నాప్ చెయ్యాలి అనుకోలేదని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. కేవలం మాట్లాడాలి అని ఆమెను తీసుకెళ్లి.. పోలీస్ లు వెతుకుతుండటం తో నల్గొండ లో విడిచి పెట్టారని ఆయన తెలిపారు. అంతే కాకుండా నవీన్ రెడ్డి కి సంబంధించిన 5 లక్షల రూపాయలు వైశాలి వాడుకున్నారని ఆయన కోర్టులో వెల్లడించారు. ఈ వాదనలు విన్న మేజిస్ట్రేట్ వైశాలి తీసుకున్న డబ్బుకు సంబంధించిన ఆధారాలు ప్రొడ్యూస్ చెయ్యాలని ఆదేశించారు. మరో వైపు పోలీసుల అదుపులో తనకు సేఫ్ గా లేదు అని నవీన్ అనడంతో విచారణను వీడియో కాన్ఫరెన్స్ లో మేజిస్ట్రేట్ విచారించారు.


You may also like