సమంత కాంబినేషన్ లో ఆకాశం దక్కించుకున్న బేబీ…!

సమంత కాంబినేషన్ లో ఆకాశం దక్కించుకున్న బేబీ…!

by Mounika Singaluri

Ads

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ మూవీలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. మొన్నటి వరకు మయో సైటీస్ అనే వ్యాధితో బాధపడిన సమంత ఒక సంవత్సరం పాటు రెస్ట్ తీసుకుని ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నారు. ఎప్పుడు తన సినిమాలకు సంబంధించిన పోస్ట్ లు, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.

Video Advertisement

బిజినెస్ లో కూడా సమంత రాణిస్తున్నారు. అయితే ఇప్పుడు మూవీ ప్రొడక్షన్ లోకి సమంత ఎంటర్ అవుతున్నట్లు తెలుస్తుంది. ట్రాలల అనే బ్యానర్ను స్థాపించి కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నట్లుగా సమంత తెలియజేశారు. వీటిలో ఎక్కువ శాతం మంది తెలుగువారికి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా చెప్పారు.

అయితే ఇప్పుడు సమంత బ్యానర్ లో తెలుగు అమ్మాయికి ఛాన్స్ దక్కిందనే వార్త వినిపిస్తుంది. బేబీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్యకి బేబీ తర్వాత మంచి ఆఫర్లు ఏమీ రాలేదు. మళ్లీ బేబీ మూవీ కాంబినేషన్ లోనే ఇంకో సినిమా చేస్తున్నారు. రామ్ పూరి జగన్నాధ్ ల డబల్ స్మార్ట్ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్నారనే వార్త కూడా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు సమంత నిర్మించబోయే సినిమాలో వైష్ణవి చైతన్య ఛాన్స్ దక్కించుకున్నారని తెలుస్తుంది. ఈ మూవీ తోనైనా వైష్ణవి చైతన్య ఫేట్ మారుతుందేమో చూడాలి


End of Article

You may also like