Home Filmy Adda వంశీ-నేత్ర విడిపోవడానికి కారణం ఏంటి.? డివోర్స్ కావాలని ముందు ఎవరు అడిగారు.? భరణం ఎంత.?

వంశీ-నేత్ర విడిపోవడానికి కారణం ఏంటి.? డివోర్స్ కావాలని ముందు ఎవరు అడిగారు.? భరణం ఎంత.?

by Mohana Priya

తెలుగులో చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు. కానీ నిజానికి దగ్గరగా ఉండే విషయాలు చెప్తూ, ఎంతో మందికి మోటివేషన్ ఇస్తున్న వ్యక్తులు మాత్రం కొంత మంది ఉన్నారు. వారిలో ఒకరు వంశీకృష్ణారెడ్డి. యూట్యూబ్ లో ఈ వ్యక్తి చాలా ఫేమస్.

ఈయన చెప్పే విషయాలు ఇంకా ఫేమస్. జీవితంలో ఏం చేయలేము అనుకునే వారికి, ఈయన చెప్పే మాటలు నిజంగానే ఏదైనా సాధించగలం అనే ఒక ఆలోచన వచ్చేలాగా చేస్తాయి. ముందు ఒక హాల్ లో కొంత మందికి మోటివేషన్ ఇవ్వడం మొదలు పెట్టి, ఆ తర్వాత చాలా మందికి స్ఫూర్తినిచ్చే విషయాలు చెబుతూ కష్టపడి పైకి వచ్చారు.

vamsee netra divorce

సాధారణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చి ఈ స్థాయికి ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. కొంత కాలం క్రితం వంశీకృష్ణ, నేత్ర అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఇద్దరు ప్రేమించుకోవడం, ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం అనేది చాలా తక్కువ కాలంలోనే అయిపోయాయి. తర్వాత వీరిద్దరూ వ్యాపారంలో భాగస్వాములుగా కూడా ఉన్నారు. అయితే ఇటీవల వారిద్దరూ విడిపోతున్నట్టు వంశీకృష్ణారెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

vamsee netra divorce

అందుకు కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. అయితే ఈ విషయం మీద వంశీకృష్ణారెడ్డి ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చి, వారు ఎందుకు విడిపోయారు అనే విషయం మీద మాట్లాడారు. ఇద్దరికీ అభిప్రాయ భేదాలు ఉన్నాయి అని, ఇద్దరూ జీవితాన్ని వేర్వేరు కోణాల్లో చూస్తారు అని, అందుకే విడిపోయారు అని చెప్పారు. డివోర్స్ కేవలం ఒకరు అడగడం మాత్రమే జరగలేదు అని, ఇది నిజంగానే మ్యూచువల్ డివోర్స్ అని చెప్పారు.

vamsee netra divorce

ఇద్దరూ కలిసి, అన్ని ఆలోచించుకొని, ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. డివోర్స్ తర్వాత భరణం లాంటివి కూడా ఏమీ అడగలేదు అని అన్నారు. వారిద్దరూ కలిసి మొదలు పెట్టిన వారధి ఫార్మ్స్ ని ఇప్పుడు నేత్ర చూసుకుంటున్నారు అని చెప్పారు. తమ ఇంట్లో వారు ఈ విషయం తెలుసుకొని చాలా బాధపడ్డారు అని చెప్పారు. ఇరువైపులా ఇంట్లో వాళ్ళు అలాగే రియాక్ట్ అయ్యారు అని అన్నారు. నేత్ర చాలా మంచి వ్యక్తి అని, చాలా జోవియల్ వ్యక్తిత్వం అని చెప్పారు. కేవలం ఈ కారణాల వల్ల మాత్రమే వారు విడిపోయినట్టు చెప్పారు.

watch video :

ALSO READ : లోకేష్-బ్రాహ్మణి పెళ్లి ఫొటోలో ఉన్న ఈ యంగ్ హీరో భార్యను గుర్తుపట్టారా.? అప్పుడు ఆమె ఎంత చిన్నగా ఉన్నారో చూడండి.!

You may also like