వనస్థలిపురంలో కరోనా కలకలం…డాక్టర్ నిర్లక్ష్యం వల్లే అంటూ ఫైర్!

వనస్థలిపురంలో కరోనా కలకలం…డాక్టర్ నిర్లక్ష్యం వల్లే అంటూ ఫైర్!

by Anudeep

ఒక డాక్టర్ కాసుల కక్కుర్తి మూలంగా ఒక కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది..అంతేకాకుండా ఏరియా మొత్తం రెడ్ జోన్ గా ప్రకటించడానికి కారణం అయింది.. ప్రపంచంలో ఉన్న డాక్టర్లంతా కరోనాపై యుద్దం చేస్తుంటే, ఈ మహానుభావుడు మాత్రం డబ్బులు సంపాదించుకోవడానికి దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా వ్యవహరించి అందరి ప్రాణాలను రిస్క్లో పెట్టారు..హైదరాబాద్ సిటికి దూరంగా ప్రశాంతంగా ఉండే వనస్థలిపురంలో  ఒక్కసారిగా కరోనా కలకలం రేగింది.

Video Advertisement

గడ్డి అన్నారం డివిజన్ శారదానగర్ కి చెందిన వ్యక్తి మలక్‌పేట గంజిలో నూనె వ్యాపారం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్న అతను  వనస్థలిపురంలో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్లి , సాధారణ జ్వరమే కదా అని స్థానికంగా ఉన్న జీవన్ సాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు.. మూడు రోజుల ట్రీట్మెంట్ అనంతరం కూడా జ్వరం తగ్గకపోవడంతో , అనుమానం వచ్చి గాంధీ హాస్పిటల్ కి తరలించగా కరోనా పాజిటివ్ అని తేలింది.

వెంటనే అతడి సోదరుడి కుటుంబ సభ్యులందరిని హోం క్వారంటైన్ చేశారు. వారిలో డెభ్బై ఏళ్ల అతడి తండ్రికి  వైరస్ లక్షణాలు కనపడడంతో అతడిని గాంధికి తీసుకెళ్లి వైద్యం అందించేలోపు మరణించారు. అప్రమత్తమైన అధికారులు కుటుంబ సభ్యులు మొత్తానికి టెస్టులు నిర్వహించగా వారిలో  నూనె వ్యాపార భార్యకు, అతడి సోదరుడికి, సోదరుడి భార్య, ఇద్దరు కూతుళ్లకూ వైరస్‌ సంక్రమించిందని నిర్దారణ అయింది.

కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అందరూ బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఎదురైంది.అంతేకాదు నూనె వ్యాపారి సోదరుడికి కూడా స్థానికంగా కిరాణా దుకాణం ఉంది.. ఆ కాలనిలో అనేక కుటుంబాలకి అతడి దుకాణం నుండే పాలు , ఇతరత్రా సరుకులు సరఫరా అవుతాయి..దీంతో అతడి నుండి ఎవరెవరికి కరోనా సోకిందో అనే భయం ప్రజల్ని వెంటాడుతుంది..అధికారులు ఆ దిశగా కూడా ఆరా తీస్తున్నారు.

కరోనా లక్షణాలతో హాస్పిటల్ కి వచ్చిన పేషెంట్ గురించి అధికారులకు చెప్పకుండా ,ట్రీట్మెంట్ కంటిన్యూ చేసిన జీవన్ సాయి హాస్పిటల్ పై, ఆ డాక్టర్ పై  స్థానికులు ఆగ్రహంగా ఉన్నారు.. అతడు కేవలం వైద్యాన్ని బిజినెస్ గా వాడుకుంటారని  స్థానికులు ఆరోపిస్తున్నారు..దీనిపై స్థానిక బిజెపి లీడర్ (మల్కాజ్ గిరి కో-కన్వీనర్)  గిరిధర్ పోచంపల్లి కేసు ఫైల్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ పై కఠిన చర్య తీసుకునే వరకు వదిలిపెట్టం అని ఆయన స్పష్టం చేశారు.

ఇదే విషయంపైన ఆ డాక్టర్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ” నా దగ్గరకి వచ్చినప్పుడు అతడికి కరోనా లక్షణాలున్నాయి.. నేను ట్రీట్మెంట్ చేసాకా, పూర్తిగా నయమయ్యాకే అతడిని ఇంటికి పంపించా” అని వైరల్ అవుతోన్న ఆ వీడియోపై నెటిజన్లు గుర్రుగా ఉన్నారు..ఎవరు నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వడానికి, ఈ టైంలో కూడా డబ్బులు సంపాదించి ఏం చేసుకుంటావు?? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 


You may also like

Leave a Comment