Varalakshmi Tiffin Center, Gachibowli Owner Details: తాజాగా హైదరాబాద్ లో చట్టవిరుద్ధమైన పదార్ధాల కేసు వ్యవహారంలో పట్టుబడ్డ వరలక్ష్మి టిఫిన్స్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి గురించి ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. ఒక సామాన్య ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రభాకర్ రెడ్డి వరలక్ష్మి టిఫిన్స్ ప్రారంభించి, జీవితంలో మంచి పొజిషన్ కి ఎదిగారు.
Video Advertisement
కానీ డ్ర-గ్స్ వ్యవహారంలో పట్టుబడి వార్తల్లో నిలిచారు. దాంతో ప్రభాకర్ రెడ్డి గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వరలక్ష్మి టిఫిన్స్ మొదలుపెట్టి, తక్కువ కాలంలోనే 10 బ్రాంచీలు ఏర్పాటు చేసేంతగా ఎదిగారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తక్కువ కాలంలోనే సిటీలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వరలక్ష్మి టిఫిన్స్ ఓనర్ డ్ర-గ్స్ వ్యవహారంలో పోలీసులకు దొరకడంతో స్థానికంగా కలకలం రేపింది. పద్నాలుగు లక్షలు విలువ చేసే డ్ర-గ్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరలక్ష్మి టిఫిన్స్ ఓనర్ ప్రభాకర రెడ్డినే కాకుండా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి గురించిన విషయాలు వైరల్ గా మారాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి టెన్త్ క్లాస్ లోనే చదువు ఆపేశాడు. ఆ తరువాత 4 చక్రాల బండి పైన రోడ్డు పక్కన టిపిన్స్ సెంటర్ మొదలు పెట్టాడు.
బాగా నడవడంతో తన వ్యాపారాన్ని విస్తరించాడు. ఆ తరువాత 2017లో ప్రకాశం జిల్లా నుండి వ్యాపారం చేయడం కోసం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. గచ్చిబౌలి లోని డీఎల్‌ఎఫ్‌లో వరలక్ష్మి టిఫిన్స్ పేరుతోనే చిన్నగా టిఫిన్ సెంటర్ మొదలుపెట్టాడు. అక్కడి టిఫిన్స్ రుచి, క్వాలిటీ బాగుండటంతో పెద్ద సంఖ్యలో జనాలు వచ్చేవారు. అలా వరలక్ష్మి టిఫిన్స్ ఫేమస్ కావడంతో ఇక్కడి టిఫిన్ కోసం జనాలు క్యూ కట్టేవారు. లాభాలు పెరగడంతో, పలు చోట్ల బ్రాంచీలను మొదలు పెట్టాడు.
వరలక్ష్మి టిఫిన్స్ ప్రస్తుతం సిటీలో 10 బ్రాంచీలు ఉన్నాయి. ఫుడ్ యాప్స్ లో కూడా వరలక్ష్మి టిఫిన్స్ కు మంచి రేటింగ్ ఉంది. ప్రతి సెంటర్ నుండి నిత్యం లక్షల్లో ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది. అలా ప్రభాకర్ రెడ్డి సామాన్యుడి నుండి రోజుకు లక్షకు పైగా సంపాదించే రేంజ్ కి ఎదిగాడు. ఆదాయం బాగా రావడంతో మెల్లగా జల్సాలకు, పబ్ లకు, పార్టీలకు అలవాటుపడ్డాడు. ఆ క్రమంలోనే డ్ర-గ్స్‌కు, ఇతర వ్యసనాలకు బానిస అయిన ప్రభాకర్ రెడ్డి, పగలంతా వరలక్ష్మి టిఫిన్స్, రాత్రి అయితే డ్ర-గ్స్ దందా చేసేవాడు. ఈ క్రమంలోనే తాజాగా పోలీసులకు పట్టుబడ్డాడు.
Also Read: మెరిడియన్ హోటల్ లో అసలు ఆ రోజు ఏం జరిగింది..? దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే..?