నడిరోడ్డు పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోయిన వర్ష, ఇమ్మాన్యుయేల్.. ఆ సెలెబ్రేషన్స్ గురించే అంటూ..

నడిరోడ్డు పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోయిన వర్ష, ఇమ్మాన్యుయేల్.. ఆ సెలెబ్రేషన్స్ గురించే అంటూ..

by Anudeep

Ads

వర్ష ఇమ్మానియేల్ కి మధ్యలో ఏం నడుస్తోంది అనేది ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఇమ్మానియేల్ ని వర్ష ప్రేమిస్తుందా అని అనుకునే వాళ్ళకి షాక్ తగిలింది. జబర్దస్త్ వేదికపై వర్ష ఇమ్మానియేల్ ప్రేమకథ మనం చూస్తూనే ఉంటాం. సుధీర్ రష్మీ తర్వాత వర్ష ఇమ్మానియేల్ ఇంత రేంజ్ లో ప్రచారాన్ని దక్కించుకున్నారు.

Video Advertisement

కొంత గ్యాప్ తరువాత వర్ష ఇటీవలే జబర్దస్త్ కి తిరిగి వచ్చింది. ఈ క్రమంలో రోజా వారి పర్సనల్ ఫొటోస్ లీక్ చేసేసారు. ఏంటి కార్ లో షికార్లు అంటూ వర్షని నిలదీశారు.

varsha-emmanuel

అయితే షూటింగ్ సమయంలో స్వల్ప అస్వస్థతకు గురైన వర్షని ఇమ్మానియేల్ తీసుకెళ్లాడని.. ఆ ఫోటో అప్పుడు తీసిందని ఆమె చెప్పింది. అలానే తన యొక్క వాయిస్ ని బట్టి హెల్త్ గురించి ఇమ్మానియేల్ కనిపెట్టేస్తాడని వర్ష అంది. ఏది ఏమైనా వీళ్ళ మధ్య ఏదో నడుస్తోంది అన్న సంగతి మాత్రం జబర్దస్త్ వీక్షకులు చర్చించుకుంటున్నారు.

varsha-emmanuel 1

తాజాగా.. వీరిద్దరూ నడి రోడ్డు పై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికిపోయారు. కార్ లో ప్రయాణం చేస్తున్న టైం లో వీరిద్దరికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నట్లు తేలింది. అయితే.. ఇదంతా నిజంగా కాదు లెండి. ఓ స్పెషల్ స్కిట్ కోసం వీరిద్దరూ అలా నటించారు.

varsha-emmanuel 3

మరి కొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యువత ఎక్కువ తాగి రోడ్లపై తిరుగుతుంటారు. దీనివల్ల అనర్ధాలు వస్తాయని.. తాగాక మితి మీరిన వేగంతో నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని ఓ మెసేజ్ ను అందించడం కోసం స్పెషల్ స్కిట్ ను చేసారు. ఈ స్కిట్ ను జబర్దస్త్ వేదిక మీద కాకుండా.. ఏకంగా నడిరోడ్డుపైనే చేశారు.. అదన్నమాట సంగతి.


End of Article

You may also like