Ads
- చిత్రం : వరుడు కావలెను
- నటీనటులు : నాగ శౌర్య, రీతు వర్మ, నదియా, మురళి శర్మ.
- నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ
- దర్శకత్వం : లక్ష్మీ సౌజన్య
- సంగీతం : విశాల్ చంద్రశేఖర్, తమన్
- విడుదల తేదీ : అక్టోబర్ 29, 2021
Video Advertisement
స్టోరీ :
భూమి (రీతు వర్మ) ఒక స్ట్రిక్ట్ ఆఫీస్ మేనేజర్. భూమికి పెళ్లి సంబంధాలు వస్తున్నా కూడా, ఒక్కరు కూడా తనకి నచ్చట్లేదు. దాంతో అందరినీ రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా, దుబాయ్ నుండి ఒక ప్రాజెక్ట్ పని మీద ఆర్కిటెక్ట్ అయిన ఆకాష్ (నాగ శౌర్య) ఇండియాకి వస్తాడు. భూమి ఆఫీస్ లో, ఆకాష్ ఒక అసైన్మెంట్ మీద పని చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో భూమి ఆకాష్ ని ఇష్టపడుతుంది. కొన్ని కారణాల వల్ల ఇద్దరు ఒకరికి ఒకరు దూరం అవుతారు. తర్వాత మళ్లీ వాళ్ళిద్దరూ కలిసారా? ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది? వారిద్దరికీ అంతకుముందే పరిచయం ఉందా? అసలు ఆకాష్ కథ ఏంటి? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సినిమా ట్రైలర్ లో చూపించిన ట్రాక్ లోనే నడుస్తుంది. ఇలాంటి కధలు మనం అంతకు ముందు చూసాం. కానీ ప్రెజెంటేషన్ కొంచెం భిన్నంగా ఉంది. కథ బాగానే ఉన్నా కూడా, స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉంది. మధ్య మధ్యలో కొన్ని సీన్స్, కొన్ని డైలాగ్స్, సప్తగిరి కామెడీ కొంతవరకు వర్కౌట్ అయ్యింది. ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి కాని వాళ్ళు, అందులోనూ ముఖ్యంగా ఆడవాళ్ళు సమాజంలో ఎదుర్కొనే సమస్యలను ఈ సినిమాలో బాగా చూపించారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు బాగున్నాయి. అలాగే తమన్ కూడా రెండు పాటలకు సంగీతం అందించారు. ఇంక పర్ఫామెన్స్ విషయానికి వస్తే, మళ్లీ పెళ్లి చూపులు సినిమా తర్వాత అంతటి స్కోప్ ఉన్న పాత్రలో రీతు వర్మ చాలా బాగా నటించారు. నాగ శౌర్య కూడా తన ఆ పాత్రకి న్యాయం చేశారు. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నాగ శౌర్య నటించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలలో బాగా నటించారు. కానీ స్క్రీన్ ప్లే స్లో ఉండటం కారణంగా, సినిమా అక్కడక్కడా బోర్ కొట్టే అవకాశాలు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
- డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- డైలాగ్స్
మైనస్ పాయింట్స్:
- చాలా స్లోగా సాగిన స్క్రీన్ ప్లే
- బోర్ కొట్టే సీన్స్
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
డైరెక్టర్ చెప్పాలనుకున్న కథ బాగున్నా కూడా, సినిమా చాలా నెమ్మదిగా సాగడంతో, వరుడు కావలెను ఒక యావరేజ్ సినిమాగా నిలిచింది.
End of Article