వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి శుభలేఖని చూశారా..? ఆ ముగ్గురి పేర్లని ముందు ఎందుకు పెట్టారు..?

వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి శుభలేఖని చూశారా..? ఆ ముగ్గురి పేర్లని ముందు ఎందుకు పెట్టారు..?

by Mounika Singaluri

Ads

మెగా ఫ్యామిలీ లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే యావత్ తెలుగు సినిమా అభిమానుల అదృష్టంతా దాని మీదే ఉంటుంది. చిరంజీవి ఆశీస్సులతో మెగా ఫ్యామిలీలో ఒక్కొక్కరు హీరోగా సెటిలై ఇప్పుడు పెళ్లిళ్ల బాట పడుతున్నారు. అందులో అందరికంటే ముందుగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

Video Advertisement

ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుంటున్నారు.
కొన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠిని నవంబర్ 1వ తారీఖున పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. ఇటలీలో ఈ వివాహ వేడుక జరగనుంది.


జూన్ 9వ తారీఖున కుటుంబ సభ్యుల మధ్య ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ జంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు వీళ్ళ పెళ్లి తమకి ఇష్టమైన ఇటలీ దేశంలో చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 1న చాలా కొద్ది మంది సమక్షంలోనే ఈ వేడుక జరగనుంది.


ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిల్వర్ కలర్ లో ఉన్న ఈ పెళ్లి కార్డులో మొదట వరుణ్ తేజ్ తాత నానమ్మ పేర్లు పెట్టారు. ఆ తర్వాత పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ పేరు చివరిగా వాళ్ళ అన్నయ్య రామ్ చరణ్ పేర్లను ముద్రించారు. ఈ పేర్లతో పాటు వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు పద్మ లావణ్య తల్లిదండ్రులు కిరణ్, దియోరాజ్ త్రిపాటి పేర్లు కూడా ముద్రించారు.

పెళ్లి కోసం వరుణ్-లావణ్యలు ఇప్పటికే ఇటలీ బయలుదేరి వెళ్లారు. ఈ విషయాన్ని వరుణ్ తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అయితే వీరిద్దరి రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా ఉండనుందట . ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
మెగా ఇంట పెళ్లి వేడుకంటే ఆ మాత్రం హడావిడి ఉంటుంది కదా….!

Also Read:షూటింగ్ అవ్వకుండానే రిలీజ్ చేసేసారు…!


End of Article

You may also like