Ads
సినిమా సినిమాకి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీస్ ఎంచుకుంటూ ముందుకి వెళ్తున్న హీరో వరుణ్ తేజ్. ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : ఆపరేషన్ వాలెంటైన్
- నటీనటులు : వరుణ్ తేజ్, మానుషి చిల్లర్.
- నిర్మాత : సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా
- దర్శకత్వం : శక్తి ప్రతాప్ సింగ్ హడా
- సంగీతం : మిక్కీ జె మేయర్
- విడుదల తేదీ : మార్చి 1, 2024
స్టోరీ :
వింగ్ కమాండర్ అర్జున్ రుద్రదేవ్ (వరుణ్ తేజ్), ఎయిర్ ఫోర్స్ వజ్ర అనే మిషన్ లో భాగంగా 20 మీటర్ల ఎత్తులో జెట్ ని నడిపితే రాడార్ కి చిక్కకుండా ఉండే కాన్సెప్ట్ ని పరీక్షించాలి అనుకుంటాడు. కానీ ఆ పరీక్ష విఫలం అవుతుంది. అందులో, ఆ మిషన్ లో భాగమైన కబీర్ (నవదీప్) చనిపోతాడు. ఈ కారణంగా ఈ మిషన్ ని ఆహానా గిల్ (మానుషి చిల్లర్) అనే మరొక వింగ్ కమాండర్ ఆపేస్తుంది. ఆహానా గిల్, అర్జున్ ప్రేమలో ఉంటారు.
ఈ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాలకి అర్జున్ కోలుకుంటాడు. ఫిబ్రవరి 14, 2019 లో పుల్వామా దాడి జరిగి, అందులో ఎంతో మంది సైనికులు వీరమరణం పొందుతారు. అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ లోకి వెళుతుంది. అక్కడ సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అర్జున్ ఈ మిషన్ లో ఎలా పాల్గొన్నాడు? అతను ఎలాంటి పై ఎత్తులు వేశాడు? పాకిస్తాన్ చర్యలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా అడ్డుకుంది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఇటీవల దేశభక్తి అనే కాన్సెప్ట్ మీద వస్తున్న సినిమాల సంఖ్య ఎక్కువగానే పెరిగింది. దేశం కోసం సైనికులు ఎలాంటి త్యాగాలు చేస్తారు అనేది సినిమాల ద్వారా చెప్పి వారి గొప్పదనాన్ని ప్రజలందరికీ తెలియజేయాలి అని దర్శకులు ప్రయత్నించడం అనేది మంచి విషయం. ఇప్పుడు ఈ సినిమా కూడా ఇలాగే దేశభక్తి నేపథ్యంలో రూపొందించారు. ఇటీవల హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఫైటర్ అనే ఒక సినిమా వచ్చింది. అది కూడా ఇలాగే పుల్వామా దాడుల నేపథ్యంలోనే సాగుతుంది. రెండిటికీ దగ్గర పోలికలు ఎంత ఉన్నాయో, తేడాలు కూడా అంతే ఉన్నాయి.
సినిమాలో ఎమోషనల్ సీన్స్ ని చాలా బాగా చూపించారు. కొన్ని సీన్స్ కంటతడి పెట్టించే విధంగానే ఉంటాయి. అయితే పుల్వామా దాడి తర్వాత ఆ సర్జికల్ స్ట్రైక్ అనేది ఎలా చేశారు అనే విషయం ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని దర్శకుడు తెరపై చూపించే ప్రయత్నం చేశారు. సినిమా మెయిన్ కాన్సెప్ట్ కూడా అదే. ఫస్ట్ హాఫ్ అంతా కూడా, సెకండ్ హాఫ్ కోసం స్టోరీ నిర్మించడానికి వాడుకున్నారు. కానీ అక్కడే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతారు. సెకండ్ హాఫ్ లో మెయిన్ కథ అంతా ఉంచి, అసలు అలా వాళ్ళు చేయడానికి కారణాలు అన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు పెట్టారు. కానీ అవి చాలా వరకు సాగదీసినట్టు అనిపిస్తాయి.
అసలు మెయిన్ పాయింట్ కి సినిమా ఎప్పుడు వెళ్తుంది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే గ్రిప్పింగ్ గా రాసుకున్నారు. క్లైమాక్స్ లో వచ్చే దేశభక్తి సన్నివేశాలు చాలా బాగా చూపించారు. సినిమా బడ్జెట్ 42 నుండి 50 కోట్ల మధ్యలో ఉంటుంది అని సమాచారం. కానీ అంత తక్కువ బడ్జెట్ లో చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. సినిమా బృందం అంతా కూడా సినిమా కోసం కష్టపడ్డారు అని చూస్తే అర్థం అవుతోంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, వరుణ్ తేజ్ ఈ పాత్రకి చాలా బాగా సూట్ అయ్యారు. ఒక ఎయిర్ ఫోర్స్ అధికారిగా చాలా బాగా కనిపించడంతో పాటు, బాగా నటించారు. మిగిలిన పాత్రల్లో నటించిన వారు కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు.
హీరోయిన్ మానుషి చిల్లర్ కి మొదటి సినిమా అయినా కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది. తన పాత్రకి తగ్గట్టు తాను నటించారు. అయితే సినిమాలో కొంత మంది హిందీ నటులు కూడా ఉన్నారు. తెలుగు సినిమా నడుస్తున్నప్పుడు, వారి లిప్ మూమెంట్ హిందీలో ఉండడం అనేది దాని మీద ఫోకస్ వెళ్లే లాగా చేస్తుంది. అక్కడక్కడ ఇది తెలుగు సినిమా కాదు ఏమో అని అనిపిస్తుంది. కానీ నటన పరంగా మాత్రం వారు కూడా బాగా నటించారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు, అందులోనూ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. హరి కే వేదాంతం సినిమాటోగ్రఫీ అయితే సినిమాకి మరొక పెద్ద హైలైట్ అయ్యింది. విజువల్స్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- ఎమోషనల్ సీన్స్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- నిర్మాణ విలువలు
- దేశభక్తి గురించి చూపించిన విధానం
మైనస్ పాయింట్స్:
- తెలుగులో కొంత మంది నటుల హిందీ మూమెంట్
- అక్కడక్కడ సాగదీసినట్టుగా ఉన్న ఫస్ట్ హాఫ్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
ఫస్ట్ హాఫ్ లో మాత్రమే సాగదీయడం లాంటివి ఉంటాయి. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ విజువల్స్ ఉన్న సినిమాల్లో ఈ సినిమా ముందు వరుసలో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో అలా ఉన్నా పర్వాలేదు, సినిమా కథనం ముఖ్యం అనుకునే వారికి, దేశభక్తి లాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు ఇష్టపడే వారికి ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఒక్కసారి చూడగలిగే ఒక మంచి ఎమోషనల్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : సమరసింహారెడ్డి మూవీ ఎన్ని థియేటర్స్ లో రీరిలీజ్ అవుతుందో తెలుసా..? రీరిలీజ్ లో రికార్డ్ ఇదే.!
End of Article