Ads
సోషల్ మీడియా వచ్చాక మీమ్స్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. చాలా సినిమాల్లోంచి టెంప్లేట్స్ ను తీసుకొచ్చి వాటికి రకరకాల జోక్స్ ను యాడ్ చేసి ఎడిట్ చేస్తున్నారు. ఈ జోక్స్ చూడడానికి చాలా సరదాగా ఉంటాయి. అందరిని నవ్విస్తూ ఉంటాయి కాబట్టి తొందరగా పాపులర్ అయిపోతున్నాయి. ఈ మధ్య వీడియో ఎడిటింగ్ లు కూడా వచ్చాయి.
Video Advertisement
ఏదైనా సినిమా లో ఒక సన్నివేశాన్ని తీసుకొచ్చి ఆ సన్నివేశం లో బిట్స్ కు మధ్య మధ్య లో కామెడీ బిట్స్ ను ఎడిట్ చేస్తున్నారు. ఈ వీడియో లు కూడా నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి వీడియోలు కామెడీ సీన్స్ కంటే ఎక్కువ గానే నవ్విస్తున్నాయి. ఫేస్ బుక్ మాధ్యమం లో అమ్మోరు దయ అనే పేజీ వారు ఇలానే ఓ వీడియో ను ఎడిట్ చేసారు.
వీరు వసంతం సినిమా లో హీరో వెంకీ వాళ్ళ బ్రదర్ కి పెళ్లి సంబంధం చూస్తారు. అయితే, వెంకీ ఏమో తనకు పెళ్లి చూపులు అనుకుని అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మరో పక్క ఫ్రెండ్స్ ఏమో అతన్ని ఆటపట్టిస్తూ ఉంటారు. తీరా చివరికి వచ్చేసరికి, పెళ్లి చూపులు తనకు కాదని, తన తమ్ముడికి అని వెంకీ కి తెలిసిపోతుంది. సినిమా పరం గా చూస్తే ఇది చాలా ఎమోషనల్ సీన్. కానీ, వీరు ఈ ఎమోషనల్ సీన్ ని కూడా చాలా కామెడీ గా ఎడిట్ చేసారు. అది ఎంత కామెడీ గా ఉందొ మీరు కూడా చూసేయండి మరి..
watch video:
End of Article