కుటుంబాన్ని పోషించడం కోసం కూరగాయలు అమ్మేది…ఆ అమ్మాయి కోసం పోలీసులు ఏం చేసారంటే?

కుటుంబాన్ని పోషించడం కోసం కూరగాయలు అమ్మేది…ఆ అమ్మాయి కోసం పోలీసులు ఏం చేసారంటే?

by Anudeep

తండ్రి అనారోగ్యంతో మంచాన పడడంతో తల్లిపైనే కుటుంబ భారం పడింది.. తల్లికి చేదోడు వాదోడుగా ఉండడానికి చదువు  మధ్యలోనే ఆపేసి ,కూరగాయలమ్ముతూ తల్లి కష్టంలో పాలు పంచుకుంది  ఆ అమ్మాయి..  కాలినడకన ఊరూరు తిరుగుతూ కూరగాయలమ్ముతున్న ఆ అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  చివరికి పోలీసుల వరకు చేరింది..ఆ అమ్మాయి ఎవరు..ఏంటి తదితర వివరాలు కనుక్కుని ఆ అమ్మాయి ఉపాదికి సాయం చేశారు..అస్సాంలో చోటు చేసుకున్న ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా మారింది.

Video Advertisement

అస్సాంకి చెందిన జన్మని గగోయ్ తల్లిదండ్రులు మనమొతి, కిరణ్ గగోయ్ ల ఏకైక కుమార్తే.. జన్మని వయసు ఇరవైఏళ్లు.. తనకి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి అనారోగ్య రిత్యా మంచాన పడ్డాడు.. అప్పటి నుండి జన్మని తల్లే కుటుంబ బాద్యతలు నిర్వహిస్తుంది.. ఇంటికి దగ్గరలోని మార్కెట్లో  కూరగాయలు అమ్ముతూ, కుటుంబాన్ని పోషిస్తూ, కూతురిని చదివిస్తోంది.. స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇక అంతకుమించి చదివించలేకపోయింది జన్మొని తల్లి..

లాక్ డౌన్ ప్రకటించడంతో మార్కెట్ మూసి వేయడంతో కుటుంబ ఉపాది పోయింది. దాంతో తల్లిదండ్రులిద్దరూ ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి.. ఈ పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించడానికి జన్మొని  కూరగాయలు తీసుకుని ఇంటింటికి వెళ్లి అమ్ముతూ ఉండేది.. సోషల్ మీడియాలో వైరలైన ఈ ఫోటో అస్సాం పోలీసులకు చేరింది..దాంతో అస్సాం దిబ్రుగర్ హెడ్ క్వార్టర్స్ కు చెందిన DSP పల్లవి మజుందర్ జన్మొనికి ఒక టివిఎస్ మోపెడ్ ని బహుకరించారు..

డబ్బులివ్వబోతే సున్నితంగా తిరస్కరించి ఆత్మాభిమానాన్ని చాటుకున్న జన్మొని, ఈ మోపెడ్ తో మరింత ఎక్కువ దూరం వెళ్లి కూరగాయలు అమ్మి నా కుటుంబాన్ని పోషించుకుంటాను అని ధీమాగా చెప్తుంది. జన్మొని కుటుంబ పరిస్థితి తెలిసిన సామాజిక కార్యకర్త ఒకరు, తన తండ్రికి వీల్ చెయిర్ ని బహుకరించారు. సోషల్ మీడియా వలన నష్టాలే కాదండీ..ఇలాంటి మంచి పనులు కూడా జరుగుతాయి..


You may also like