Ads
విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో 75వ సినిమా మైలురాయిని చేరుకున్నారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు తనయుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు నిర్మాతగా,డిస్ట్రిబ్యూటర్ గా సురేష్ ప్రొడక్షన్స్ ముందుండి నడిపిస్తున్నారు.
Video Advertisement
ప్రస్తుతం వెంకటేష్ ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్ లో చేస్తున్న సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. థ్రిల్లర్ జానర్ లో తిరగకన ఈ మూవీ పైన ఇప్పటికే మంచి అంచనాలను నెలకొన్నాయి. అయితే దీనికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 27 తారీఖున హైదరాబాద్ లో గ్రాండ్ గా చేయనున్నారు.
ఈ మూవీకి వెంకటేష్ నటించిన 75 సినిమాలకు సంబంధించిన దర్శకులను నిర్మాతలను చీఫ్ గెస్ట్లుగా పిలవనున్నారట. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలైన చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున, నాని తదితరులు ఈ ఫంక్షన్ కి హాజరుకానున్నట్లు సమాచారం. ఇక వెంకీతో పని చేసిన ఎందరో దర్శకులు కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు. కె రాఘవేంద్రరావు, బి గోపాల్, కోదండరామిరెడ్డి, ముప్పలనేని శివ, భీమినేని శ్రీనివాసరావు, సురేష్ కృష్ణ, జయంత్ సి పరాంజీ ఇలా ఎందరో హాజరయ్యేందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం.
అయితే ఈ ఫంక్షన్కు ఇతరుల ఎవ్వరికి పర్మిషన్ లేదట కేవలం సినీ ప్రముఖుల సమక్షంలో మాత్రమే జరగనుంది అని తెలుస్తుంది. అయితే ఫంక్షన్ అయిపోయాక ఈటీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారట. కలియుగ పాండవులు సినిమాతో మొదలైన వెంకటేష్ సినీ ప్రస్థానం 75 సినిమాలుకు చేరుకుని దిగ్విజయంగా కొనసాగుతుంది. ఫ్యామిలీ హీరోగా, కామెడీ హీరోగా, మాస్ హీరోగా ఇలా చేయని పాత్ర వేయని వేషం లేకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు వెంకటేష్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే హీరోగా, అందరికీ ఆప్తుడిగా వెంకటేష్ పేరు తెచ్చుకున్నారు
End of Article