Ads
మన ఇండస్ట్రీలో ఎన్నో హీరో హీరోయిన్ కాంబినేషన్స్ ఉన్నాయి. అందులో కొంత మంది హీరో హీరోయిన్లు ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో కలిసి నటించారు. అలా నటించిన వారిలో కొంత మంది హిట్ కాంబినేషన్స్ గా గుర్తింపు పొందారు. అలా హిట్ పెయిర్ గా గుర్తింపు పొందిన కాంబినేషన్స్ లో ఒక కాంబినేషన్ విక్టరీ వెంకటేష్, సౌందర్య. వెంకటేష్ సౌందర్య కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఆ సినిమాలు ఏవో అందులో ఎన్ని హిట్ సాధించాయో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 రాజా
అసలు వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ అంటే చాలా మందికి గుర్తొచ్చే సినిమా రాజా. ముప్పలనేని శివ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది.
#2 పవిత్ర బంధం
వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన మరొక సినిమా పవిత్ర బంధం. ఈ సినిమాకి ముత్యాల సుబ్బయ్య గారు దర్శకత్వం వహించారు.
#3 ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
ఇవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
#4 పెళ్లి చేసుకుందాం
ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా హిట్ సాధించింది.
#5 దేవి పుత్రుడు
2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాకి కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మరొక హీరోయిన్ అంజలా జవేరి నటించారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
#6 జయం మనదేరా
ఈ సినిమాలో వెంకటేష్ డబుల్ రోల్ లో నటించారు. ఇందులో ఒక వెంకటేష్ కి పెయిర్ గా సౌందర్య నటించారు. మరొక వెంకటేష్ కి పెయిర్ గా భాను ప్రియ గారు నటించారు. ఈ సినిమాకి ఎన్.శంకర్ గారు దర్శకత్వం వహించారు.
End of Article