జ్యోతిష్కుడు వేణు స్వామి వివాదాస్పద కామెంట్స్..! రాశి ఖన్నా, స్టార్ హీరో, యాంకర్ కు అలా జరుగుతుంది.!

జ్యోతిష్కుడు వేణు స్వామి వివాదాస్పద కామెంట్స్..! రాశి ఖన్నా, స్టార్ హీరో, యాంకర్ కు అలా జరుగుతుంది.!

by Anudeep

Ads

వేణు స్వామి గుర్తున్నారా? ప్రముఖ జ్యోతిష్యుడు . సినిమా వాళ్ల, రాజకీయ నాయకుల భవిష్యత్ చెప్పే గొప్ప జ్యోతిష్యుడు . తాను చెప్పే 100 జాతాకాల్లో 90 ఖచ్చితంగా జరిగితీరుతాయని చెప్తుంటారు. ఇవన్ని ఎవరో చెప్పిన మాటలు కాదండి అతనే స్వయంగా చెప్పారు. ఒక టివి ఛానెల్లో బాబుగోగినేనితో జరిగిన వివాదం తర్వాత కనిపించకుండాపోయిన వేణు స్వామి, మళ్లీ వార్తల్లోకి వచ్చారు .

Video Advertisement


సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఎలక్షన్స్ అప్పుడైతే వీటికున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు . వాళ్లు చెప్పేది నిజమా కాదా , జరుగుతుందా జరగదా అని ఎవరూ ఆలోచించరు. ఎలక్షన్ రిజల్స్ట్ వచ్చాకా ఎవరూ పట్టించుకోను కూడా పట్టించుకోరు. ఎలక్షన్స్ టైంలో, క్రికెట్ మ్యాచ్ లప్పుడు ,సినిమా లకు సంభందించి జ్యోతిష్యాన్ని నమ్ముకునే వాళ్లు,నమ్మేవాళ్లు ఉంటారు. ఇలాంటి జ్యోతిష్యానికి సంబంధించి వివాదస్పద వాఖ్యలు చేసి వేణు స్వామి ఫేమస్ అయ్యారు.

మరికొద్ది రోజుల్లో ఉగాది రాబోతోంది. కొత్త సంవత్సరం తమకెలా ఉండబోతోందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అయితే ఎవరికి ఎలా ఉంటుందో కానీ రాశి కన్నా కి మాత్రం సూపర్ గా ఉంటుందని జోస్యం చెప్పారు వేణు స్వామి. కొత్త ప్రాజెక్ట్స్ తో టాప్ హీరోయిన్ స్థానానికి చేరుకుంటుందని అన్నారు.తనునటించే సినిమాలన్ని ఘనవిజయం సాధిస్తాయని చెప్పుకొచ్చారు.

అంతేకాదు ఒక స్టార్ హీరో తీవ్ర అనారోగ్యానికి గురౌతారని, ఒక యంగ్ పొలిటీషయన్ పెద్ద యాక్సిడెంట్ కి గురౌతారని పేర్లు చెప్పకుండా వ్యాఖ్యలు చేశారు. ఈ వాక్యల పట్ల నెటిజన్లు వ్యతిరేక కామెంట్స్ చేస్తున్నారు. పేర్లు చెప్పకుండా జాతకం చెప్పడం ఏంటి, దమ్ముంటే పేర్లు చెప్పాలని, నువ్ చెప్పే జాతకం నిజం అవుతుందా అని కామెంట్స్ చేస్తున్నారు.

ఒక తెలుగు యాంకర్ వైవాహిక జీవితంలో వివాదాలు చోటుచేసుకుంటాయని, భర్త నుండి విడాకులు పొందుతుందని మరో కామెంట్ చేసారు వేణు స్వామి. వేణు స్వామి భార్య కూడా యాంకరే. ఆ యాంకర్ మీ ఆవిడే, నువ్ ఇలా పిచ్చి పిచ్చి జాతకాలు చెప్తే ఆవిడ వదిలేసి పోవడం ఖాయం అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. పబ్లిసిటి కోసమే వేణుస్వామి ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారని కొందరు మండిపడుతున్నారు.


End of Article

You may also like