ప్రస్తుత కాలం లో సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ఫేమస్ అయిపోతున్నారు. ఆలా ఫేమస్ అయిన వారిలో ఒకరు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి. బాబు గోగినేని అనే ప్రముఖ నాస్తికుడు ఇతడిని ఫ్రాడ్ అన్నాడు. కానీ అతడి విషయం లో వేణు స్వామి చెప్పింది నిజం కావడం తో బాగా పాపులర్ అయిపోయాడు. అంతకు ముందు ఎవరికీ వేణు స్వామి గురించి తెలియదు.

Video Advertisement

 

తర్వాతి నుంచి పలు యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యూ లు ఇస్తూ.. సెలెబ్రెటీల జాతకాల గురించి చెప్పడం మొదలు పెట్టాడు. సమంత- నాగ చైతన్య విడాకులు, రామ్ చరణ్ పిల్లల విషయం నుంచి తాజాగా మహేష్ బాబు కుటుంబం లో వరుస మరణాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అతడు చెప్పిన కొన్ని విషయాలు నిజం కావడంతో జనాలు కూడా ఈయన్ని నమ్మడం స్టార్ట్ చేసారు.

venu swami comments about prabhas..

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఆయన ప్రభాస్ జాతకం గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రభాస్ జాతకం ఏ మాత్రం బాగా లేదని ఆయన కామెంట్స్ చేసారు. వచ్చే ఏడాది నుంచి ప్రభాస్ ఆరోగ్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అని అన్నారు. ప్రభాస్ జాతకరీత్యా ఆయనది వృశ్చిక రాశి అని చెప్పిన వేణు స్వామి… ప్రస్తుతానికి శని గురువు స్థానాలు మారుతున్నాయి అన్నారు. దీంతో ఆయనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

venu swami comments about prabhas..

ప్రభాస్ కి అర్థాష్టమ శని, ఒకవైపు అష్టమ గురువు, ఒకవైపు షష్ఠమ గురువు మరోవైపు ఉండడంతో ఆయన అనేక సమస్యలను ఎదుర్కోబోతున్నారంటూ హెచ్చరించారు. సినిమాల పరం గా కూడా ప్రభాస్ కి ఇబ్బందులు ఉంటాయి అంటూ ఆయన తెలిపారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కాస్త ఇబ్బంది పడుతున్నారు. విడుదలైన రెండు చిత్రాలు కూడా హిట్ కాలేదు. మరో వైపు వచ్చే ఏడాది వరుస ప్రాజెక్ట్లు లైన్ లో ఉన్నాయి. ఈ తరుణంలో వేణు స్వామి చెప్పిన జాతకంపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది.