Venu Thottempudi : “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాలో… “వేణు తొట్టెంపూడి” పాత్ర ఇలాగే ఉండబోతోందా..?

Venu Thottempudi : “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాలో… “వేణు తొట్టెంపూడి” పాత్ర ఇలాగే ఉండబోతోందా..?

by Anudeep

Ads

రెండు దశాబ్దాల క్రితం స్వయంవరంతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చాడు వేణు తొట్టెంపూడి. అటు యూత్ ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ సంపాదించుకున్నాడు వేణు. హీరోగా చేసింది కొన్ని సినిమాలే అయినా కమర్షియల్ ఫార్ములాకి దూరంగా ఉంటూ క్లీన్ ఎంటర్ టైనర్స్ లో నటించాడు. ముఖ్యంగా చిరునవ్వుతో క్యారెక్టరైజేషన్ ఇప్పటికీ మంచి వ్యక్తిత్వ వికాసానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Video Advertisement

స్వయంవరం, పెళ్ళాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్ ఎప్పుడు టీవీలో వచ్చినా హ్యాపీగా ఇంటిల్లిపాదీ చూసి ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత వరస ఫ్లాపులతో సినిమాలకు దూరమయ్యాడు వేణు. 2012లో తిరిగి దమ్ములో కనిపించాడు కానీ అందులో చనిపోయే అంతగా ప్రాధాన్యం లేని పాత్ర కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.
అయితే ప్రస్తుతం వేణు రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ లో పోలీస్ గా కనిపించనున్నాడు. ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఇది కీలకమైన క్యారెక్టరే అయినప్పటికీ దమ్ము లాగే ఇందులో కూడా సాడ్ ఎండింగ్ ఉండొచ్చని అంటున్నారు. వేణు సెకండ్ ఇన్నింగ్స్ కి ఇదే కరెక్ట్ టైం. సో వేణు కనక సినిమాలను జాగ్రత్తగా ఎంచుకుంటే వరుస ఆఫర్లు వస్తాయి. అలాగే రామారావు ఆన్ డ్యూటీ ఫలితం కూడా కీలకం కానుంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసమే వేణు ప్రత్యేకంగా మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. చూడాలి వేణు సెకండ్ ఇన్నింగ్స్  ఎలా ఉండబోతుందో..


End of Article

You may also like