Ads
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం సినిమా 2022 లో విడుదలైంది. ఈ మూవీని శ్రీలక్ష్మీ సుధాకర్ చెరుకూరి, దగ్గుబాటి సురేశ్ బాబు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు.
Video Advertisement
నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఏడాది గడిచిన సందర్భంగా మూవీ డైరెక్టర్ వేణు ఊడుగుల సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఆ పోస్ట్ లో ఇలా రాసుకొచ్చాడు..
“విరాటపర్వం విడుదలై ఈరోజుతో ఏడాది పూర్తయింది. విరాట పర్వానికి ముందు ఉన్న ‘నేను’ దాని విడుదల తర్వాత ఉన్న ‘నేను’ ఒకటి మాత్రం కాదు. విరాటపర్వం అందమైన అనుభూతుల్ని ఇచ్చింది. ఎందరో బుద్ధి జీవుల ప్రగతిశీల ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను ఇచ్చింది. అదే సమయంలో మార్కెట్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది. కాలి కింద మందుపాతర పేలినట్టయింది. కొన్ని నెలలపాటు నిద్ర లేని రాత్రులనిచ్చింది. ఈ వైరుధ్యం నన్ను ఆలోచనలో పడేసింది.”
“నాకు నా ప్రేక్షకులకు మధ్య అనుబంధాన్ని పునః సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని విప్పి చెప్పింది. ఈ ఏడాది పాటు నాలో సృజనాత్మక వ్యక్తిత్వాన్ని నేను మరింత అర్థం చేసుకోవడానికి విరాటపర్వం స్ఫూర్తినిచ్చింది. అందుకే విరాట పర్వం నాకు ఒక సెల్ఫ్ డిస్కవరి లాంటిది. తీయబోయే చిత్రాలకు ఉపోద్ఘాతం లాంటిది.”
“విరాటపర్వం అనే ప్రయాణం మొదలెట్టిన నాటి నుండి ఇప్పటివరకు ఇకముందు ఈ అనుభవంలో భాగమైన నా ప్రేక్షకులకు, తూము సరళక్క కుటుంబ సభ్యులకు, సినిమాలో నటించిన నటీనటులకు, నా డైరెక్షన్ టీమ్ కి, రైటింగ్ టీమ్ కి, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ సర్, సినిమాటోగ్రఫీ డాని సలో శాంచెజ్-లోపెజ్, సంగీతం సురేష్ బొబ్బిలి, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనాగేంద్ర తంగాల, నా పీఆర్వోలు వంశి శేఖర్ లకు మరియు మీడియా మిత్రులకు, విమర్శకులకు నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు.”
“ముఖ్యంగా నా నిర్మాతలు సుధాకర్ చెరుకూరి సర్, శ్రీకాంత్ చుండి మరియు డి సురేష్ బాబు సర్, రానా దగ్గుబాటి , సాయిపల్లవి గార్లకు ప్రత్యేక కృతఙ్ఞతలు” అని రాశారు
Also Read: “వర్షం” సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని గుర్తుపట్టారా.? ఇప్పుడు హీరోలా ఉన్నాడు చూడండి.!
End of Article