Ads
ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి. కష్టాలు ఉన్నాయని పదేపదే బాధపడడం వలన ఆ కష్టాలు మన నుండి దూరం అవ్వవు. ప్రతి ఒక్కరు కూడా కష్టాల నుండి బయటపడడానికి చూసుకోవాలి. కష్టాలని అధిగమించి బాడీబిల్డర్ గా ఎదిగిన ఈ ఒంటరి మహిళ పడిన కష్టాన్ని చూస్తే శభాష్ అంటారు. మరిక ఆమె కథ చూద్దాం..
Video Advertisement
తమిళనాడులోని మధురై కి చెందిన వేరోనికా వాళ్లది మధ్య తరగతి కుటుంబం. భర్త వదిలేసిన తర్వాత ఆమెకి ఎన్నో కష్టాలు మొదలయ్యాయి.
కొన్నాళ్ల తర్వాత తన తండ్రి కూడా చనిపోయారు నిజానికి తన తండ్రి మరణంతో ఆమె కుంగిపోయారు. కానీ తర్వాత ఆమె దాని నుండి బయట పడి బాడీ బిల్డర్ గా ఎదిగారు. ఇప్పుడు ఎంతోమందికి ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నిజానికి ఆడవాళ్లు జిమ్ కి వెళ్ళకూడదని పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాలని ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అవి ఏమి నిజం కాదు. కేవలం అపోహలు మాత్రమేనని అంటున్నారు ఈమె. కేవలం కొన్ని కొన్ని వ్యాయామాలకే అటువంటి బట్టలు కావాలి అని అన్నారు.
ఈమె జిమ్ కి వెళ్లడంతో పాటుగా తన పిల్లల్ని చూసుకోవడం పెంపుడు జంతువులతో సమయాన్ని గడపడం… ఇంటి పనులు చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత ఈమె బరువు బాగా పెరిగి పోయారు. తర్వాత బరువు తగ్గాలని చూశారు. బరువు తగ్గేందుకు ఆమె జిమ్ కి వెళ్లడం మొదలుపెట్టారు. అయితే ఆడవాళ్ళు జిమ్ కి వెళ్ళకూడదు అని ఇలా చాలామంది ఎన్నో చెప్తూ ఉంటారు కానీ తనకి తన ఆరోగ్యమే ముఖ్యమని.. పిల్లలు, ఆరోగ్యం కోసమే ఇలా చేస్తున్నానని ఆమె చెప్పారు. అయితే ఈమె జిమ్ కి వెళ్లడం వలన చాలా మంది ఈమె ని దూరం పెట్టేసారు.
కొంతమంది స్నేహితులు కూడా మాట్లాడడం మానేశారట. ఆరోగ్యం కోసం జిమ్ కి వెళ్తున్నారు. బాడీ బిల్డింగ్ లో ఈమె రాష్ట్రస్థాయి జాతీయస్థాయిలో 7 8 టైటిల్స్ ని గెలుచుకున్నారు. ఓపెన్ ఏషియా ఉమెన్స్ బాడీ బిల్డింగ్ లో ఈమె ఆరవ స్థానంలో నిలిచారు. ఈమె నార్త్ ఇండియా బాడీ బిల్డర్ గా మారాలని అనుకుంటున్నారు. ఆమె లక్ష్యాన్ని ఆమె చేరుకోవడం కొంచెం కష్టమే… కానీ ఆమె దానిని చేరుకుంటానని చెప్తున్నారు. ఆమె తన లక్ష్యాన్ని చేరుకోవాలని మనం కూడా ఆశిద్దాం.
End of Article