గర్భంతో ఉందని కూడా చూడలేదు..ముక్కలు ముక్కలు గా నరికేశారు.. అసలేమైందంటే..?

గర్భంతో ఉందని కూడా చూడలేదు..ముక్కలు ముక్కలు గా నరికేశారు.. అసలేమైందంటే..?

by Anudeep

Ads

వరకట్నం సమస్య తీరుతోంది అని అనుకుంటుండగానే.. కొత్త కేసు బయటపడుతోంది. తాజాగా.. బీహార్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కలచివేస్తోంది. గర్భం తో ఉందని కూడా చూడకుండా.. కోడలిని భర్త, అత్తమామలు చిత్రహింసలకు గురిచేసారు. ఆపై ఆమెను ముక్కలు ముక్కలు గా కోసేసి రోడ్డుపై వదిలేసారు. బీబీసీ ప్రచురించిన ఈ కధనం చదివితే కళ్ళ వెంబడి నీళ్లు వస్తాయి.

Video Advertisement

bihar woman1

బీబీసీ కధనం ప్రకారం, మంజు దేవి అనే మహిళకు, కాజల్ అనే కుమార్తె ఉంది. ఆమెను.. నలందా జిల్లా హిల్సా లో బిఘా అనే గ్రామానికి చెందిన సంజీత్ కుమార్ కు ఇచ్చి వివాహం చేసారు. సంజీత్ రైల్వే గ్రూప్ డి ఉద్యోగం లో పని చేస్తున్నాడు. సంజీత్ బెంగళూరు లో పని చేసేవాడు. సంజీత్ కు కట్నం గా పన్నెండు లక్షల రూపాయలను, మోటార్ సైకిల్ ను, నగలని ఇచ్చారు. పెళ్ళైన ఏడాదికి సంజీత్ కు ప్రమోషన్ వచ్చింది.

bihar woman 3

తరువాత సంజీత్ టీటీఈ అయ్యాడు. దీనిని సాకుగా చూపిన సంజీత్ తల్లితండ్రులు మరింత కట్నం ఇవ్వాలని కాజల్ తల్లితండ్రులపై ఒత్తిడి పెట్టారు. మరోవైపు కాజల్ ను కూడా చిత్ర హింసలు పెట్టేవారు. గతం లో కూడా కాజల్ అత్తింటివారు పెడుతున్న చిత్ర హింసల గురించి తల్లికి చెప్పుకునేది. చివరగా జులై 17 న ఆమె తన తల్లితో మాట్లాడింది. ఆ తరువాత తన మొబైల్ స్విచ్ ఆఫ్ రావడం తో.. సంజీత్ కుటుంబ సభ్యులకు కాల్ చేశామని మంజు దేవి చెప్పారు.

bihar woman2

అయితే.. వారెప్పుడు పిల్లని ఇంటికి పంపేవారు కాదని.. కనీసం ఫోన్ లో మాట్లాడించడానికి కూడా వారెవరు ముందుకురాలేదన్నారు. కాజల్ అన్న, తండ్రి కూడా వారింటికి వెళ్లి ఆమెను పంపించమని అడిగినప్పుడు కూడా.. వారు ఒప్పుకోలేదు. ఐతే ఫోన్ కూడా మాట్లాడించకపోవడం తో అనుమానం వచ్చింది. ఆమె కోసం వెతుకులాట మొదలుపెట్టారు. గ్రామస్తుల సూచనలతో చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికి చూడగా.. కాజల్ శరీర భాగాలు ముక్కలు ముక్కలు గా పడవేసి కనిపించాయి.

bihar woman 4

రోడ్డుకు ఐదొందల మీటర్ల దూరం లోపలకు వెళ్లి చూడగా ఆమె మృతదేహం లోని భాగాలు కనిపించాయి. ఆ ముక్కలను సంచిలో వేసుకుని తీసుకురావలసిన పరిస్థితికి కాజల్ కుటుంబం కుమిలిపోయింది. పోలీసులు కూడా ఈ కేసు ని పట్టించుకోకపోవడం తో వారు బాధపడుతున్నారు. దొరికిన శరీర భాగాలనే తీసుకొచ్చి దహనం చేశారు. “పోలీసులు అక్కడే ఉన్నా.. వారు కనీసం మృతదేహాన్ని తాకనైనా లేదని.. శరీరాన్ని సంచీలలో పెట్టి తీసుకురావాల్సి వచ్చిందన్నారు.. ఏం చేస్తాం..?” అంటూ కాజల్ తండ్రి అరవింద కుమార్ ఆవేదన చెందారు.

bihar police

జులై 20 న పోలీసులు హత్య కేసుని నమోదు చేసారు. ఇది హత్యా? లేక ఆత్మహత్య చేసుకున్నాక ముక్కలు గా కోశారా ? అన్న విషయం తేలాల్సి ఉంది. సెక్షన్ 304 బి కింద భర్త, అత్తమామలు, సంజీత్ సోదరుడు, అక్క చెల్లెళ్ళు, వారి భర్తలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


End of Article

You may also like