ఒకప్పుడు పెళ్లంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి గానీ చేసే వారు కాదు. ప్రస్తుతం సంబంధాలు చూడడం అన్న పద్ధతే పూర్తి గా మారిపోయింది. పిల్లలే ప్రేమిస్తున్నాం అంటూ ఎవరో ఒకరిని తీసుకొచ్చి పరిచయం చేయడం.. సరే అనేక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాదంటే.. ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నారు.

shalini 1

ఇంతలా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న వారు ఏమైనా సఖ్యం గా ఉన్నారా..? అంటే అదీ లేదు. ప్రేమ వివాహాలు సైతం దుఃఖాంతమవుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తలు కూడా పెళ్లి అయిన తరువాత భార్య పై ప్రేమ చూపించడం లో పక్షపాతం చూపిస్తున్నారు. కట్నాలు తీసుకురాలేదని.. మర్యాదలు లేవని.. ఇలా ఏదో ఒక కారణం తో వేధిస్తున్నారు. తాజాగా.. హర్యానా కు చెందిన సీతాపూర్ జిల్లా ఖజురియా గ్రామానికి చెందిన షాలిని(18) అనే అమ్మాయి పక్కన ఇంట్లోనే ఉండే విశాల్ సింగ్ అనే అబ్బాయిని ప్రేమించింది.

girl suicide

వీరి ప్రేమ ఇంట్లో కూడా తెలిసింది. ఇరు కుటుంబాల వారు అడ్డు చెప్పారు. దీనితో వారిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోయి దగ్గరలోని శ్యామ్‌నాథ్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. వివాహం అయిన దగ్గరినుంచి షాలిని కి విశాల్ నుంచి ఒత్తిడి పెరిగింది. పుట్టింటికి వెళ్లి కట్నం తీసుకురావాలంటూ వేధించసాగాడు. అతనికి వేరే పని కూడా దొరకకపోవడం తో చేతిలో పైసా కూడా మిగలలేదు.

girl suicide 2

ఏదో ఒక పనిని వెతుక్కోవాలని విశాల్ ఆలోచించకుండా.. కట్నం తేవాలంటూ షాలిని ని వేధించేవాడు. అతని వేధింపులు భరించలేక ఓ సారి షాలిని తన అన్న సోను వద్దకు వచ్చి తన బాధను వెళ్లబోసుకుంది. తొందరపడి ఇంట్లోంచి బయటకు వచ్చానని.. రెండు లక్షలు కట్నం తేవాలంటూ.. తన భర్త తనని వేధిస్తున్నాడని చెప్పుకుని బాధపడింది. ఈ విషయమై అతను సీతాపూర్ ఎస్పీ కి ఫిర్యాదు చేయించగా.. వారు భార్యా భర్తలు ఇద్దరినీ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

girl suicide 3

మరోసారి ఆమెను కట్నం కోసం ఇబ్బంది పెడితే సహించేది లేదని విశాల్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ ఘటన తరువాత చెల్లెలి పై సోను కూడా కోపం పెంచుకున్నాడు. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. నాలుగు నెలలకు తన చెల్లి ఎలా ఉందో చూద్దామని వారు నివాసం ఉంటున్న రాయ్ గ్రామానికి వెళ్ళాడు. తీరా వెళ్లేసరికి తన చెల్లి అనుమానాస్పదం గా చనిపోయిందన్న విషయం తెలిసింది. ఆగష్టు పదవ తేదీనే తను చనిపోయిందని.. ఆమె అంత్యక్రియలు కూడా ఆ గ్రామం లోనే జరిగాయని తెలుసుకుని సోను నిర్ఘాంతపోయాడు.

girl suicide

ఈ ఘటన గురించి ఆమె కుటుంబానికి కనీసం సమాచారం కూడా అందలేదు. దీనితో ఆమె మరణం పై పలు అనుమానాలు తలెత్తాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న షాలిని నాలుగు నెలలు తిరగకుండానే విగతజీవి గా మారింది. తమ కూతురి చివరి చూపు కూడా దక్కలేదని ఆ తల్లితండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.