Ads
ఇటు టాలీవుడ్ లోనే కాక అటు కోలీవుడ్ లో కూడా స్టార్ డైరెక్టర్‌గా బాగా ఫేమస్ అయిన వ్యక్తి శంకర్. సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శంకర్ క్రేజ్ ప్రతి సినిమాకి పెరుగుతుంది. ఇప్పుడు అతను చేసే ప్రతి సినిమాకి సుమారు 40 నుంచి 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Video Advertisement
ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ మరియు ఇండియన్ 2 చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. గేమ్ ఛేంజర్ చిత్రం లో రామ్ చరణ్ నటించిన విషయం తెలిసిందే. మరోపక్క కమల్ హాసన్ తో చేస్తున్న ఇండియన్ 2 మూవీ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు మూవీస్ ఇప్పటికే మంచి పాజిటివ్ బజ్‌ను సంపాదించాయి.
శంకర్ కూతురు అదితి శంకర్ సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె ఎంతో సక్సెస్ఫుల్ కావాలని అభిమానులు కోరుకుంటున్నప్పటికీ మొదటి సినిమాతో యావరేజ్ మార్కులు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె శివ కార్తికేయన్ తో జోడిగా నటిస్తున్న శంకర్ మావీరన్ మూవీ తో స్టార్ స్టేటస్ సంపాదిస్తుంది అని అందరూ ఆశిస్తున్నారు. ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రంపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
ఈ చిత్రంలో జర్నలిస్ట్ రోల్ ప్లే చేస్తున్న అతిథి శంకర్ మూవీకి గాను అందుకున్న పారితోషకం 25 లక్షలు మాత్రమే. ఆమెకు ఇప్పుడు వస్తున్న సినిమా ఆఫర్లు కూడా కేవలం శంకర్ కారణంగా వస్తున్నాయి అని పుకారు ఉంది. అయితే అదితి మాత్రం ఎటువంటి ఏమీ లేవు అని పేర్కొనడం జరిగింది. ప్రస్తుతానికి ఆమెకు తన తండ్రి డైరెక్షన్ లో నటించాలి అన్న అభిలాష మాత్రమే ఉందట డైరెక్షన్ పై ఎటువంటి ఇంట్రెస్ట్ లేదట.. మరి కనీసం భవిష్యత్తులో అయినా తండ్రికి తగ్గ కూతురు అనిపించుకొని తండ్రి రేంజ్ పారితోషకం అందుకుంటుందేమో చూడాలి.
End of Article