భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసిన భర్త.. చివరకు లాడ్జి లో ఎలాంటి పరిస్థితి లో కనిపించిందంటే..?

భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసిన భర్త.. చివరకు లాడ్జి లో ఎలాంటి పరిస్థితి లో కనిపించిందంటే..?

by Anudeep

Ads

గత కొంత కాలం గా వివాహేతర సంబంధాలు ఎక్కువ గా కనిపిస్తున్నాయి. పెళ్లి అయినా స్త్రీ లేదా పురుషులు పరాయి స్త్రీ/పురుషులపై వ్యామోహం చెందడం వలన ఇలాంటివి ఎక్కువ గా జరుగుతున్నాయి. ఆ మోహం వలన సొంత భార్య లేక భర్తలను మోసం చేయడం.. చివరకు వారి ప్రాణాలు తీయడమో లేక తమ ప్రాణాలు తీసుకోవడమో జరుగుతోంది. తాజాగా.. ఈ కారణం గా ఓ వివాహిత ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన కేరళలోని కోజికోడె లో చోటు చేసుకుంది.

Video Advertisement

illegal relationships 3

వివరాల్లోకి వెళ్తే కోజికోడె లో ఓ వివాహిత జులై 19 నుంచి కనిపించకుండా పోయింది. దీనితో.. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రోజులానే పనికి వెళ్లిన ఆమె కనిపించకుండా పోవడం తో భర్త ఆందోళన చెందాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని వెతుకులాట ప్రారంభించారు. ఆమె పని చేసే చోట విచారిస్తే.. ఆమె మరో పెళ్ళైన వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు తేలింది. దీనితో ఆ కోణం లో కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు.

illegal relationships 1

దర్యాప్తు జరుగుతుండగానే.. తమిళనాడు లోని కోయంబత్తూరు లో ఓ లాడ్జి లోని రూమ్ లో బిందు విగత జీవి గా కనిపించింది. అదే రూమ్ లో మరో వ్యక్తి ముస్తఫా కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. దీనితో పోలీసులు మరింత లోతు విచారణ చేస్తే.. తేలింది ఏమిటంటే.. బిందు కనిపించని రోజు నుంచి ముస్తఫా కూడా కనిపించకుండా పోయినట్లు మిస్సింగ్ కేసు నమోదు అయింది. వీరిద్దరూ ఒకేసారి అనుకుని బయటకు వచ్చి కలుసుకున్నారు. కోయంబత్తూరు లోని ఓ లాడ్జి లో కలుసుకున్నారు. వారిద్దరూ భార్య భర్తలమని చెప్పి రూమ్ తీసుకున్నారట. కొన్ని రోజుల పాటు ఆ రూమ్ లోనే వారి బంధాన్ని కొనసాగించారు.

illegal relationships 2

అయితే.. ఎక్కువ కాలం పాటు ఇలా ఉండడం కష్టమని అర్ధం చేసుకున్న వారు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. బిందు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ముస్తఫా కూడా బ్లేడు పెట్టి మణికట్టు వద్ద కోసుకున్నాడు. రెండు రోజులైనా తలుపులు తీయకపోవడం తో అనుమానం వచ్చిన లాడ్జి మానేజ్మెంట్ తలుపు పగలగొట్టి చూడగా.. ముస్తఫా కొన ఊపిరి తో కనిపించాడు. బిందు కు ఏడేళ్ల పాప ఉండగా.. ముస్తఫా కు కూడా భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తవుతుందనగా.. బిందు విగత జీవి గా మారడం తో ఆమె కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.


End of Article

You may also like