ఇంటికొచ్చి మరీ ఇలా చేస్తే..ఆడపిల్లలు ఎక్కడ ఉండాలి..? కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన..!

ఇంటికొచ్చి మరీ ఇలా చేస్తే..ఆడపిల్లలు ఎక్కడ ఉండాలి..? కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన..!

by Anudeep

Ads

ఈ మధ్య కాలంలో ఆడపిల్లలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న పెద్దా వయసు తారతమ్యాలు లేకుండానే ఈ ఘోరాలు జరుగుతున్నాయి. తాజాగా.. గోదావరిఖని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేకే నగర్ లో ఇలాంటి ఘోరం చోటు చేసుకుంది. కేకే నగర్ లో నివాసం ఉంటున్న 20 ఏళ్ల గొడుగు అంజలి హత్య చేయబడింది.

Video Advertisement

 

ఆమె తన తల్లితో కలిసి నివాసం ఉంటోంది. ఆమె తండ్రి అంజలి చిన్నతనంలోనే చనిపోయాడు. అప్పటినుంచి తల్లి లక్ష్మి కూలి పనులను చేసి అంజలిని చదివిస్తోంది. రోజు ఉదయాన్నే లక్ష్మి కూలిపనులు చేసుకోవడానికి వెళ్లిపోయేది. ఇంట్లో అంజలి ఒక్కత్తే ఉండేది. ఇది గమనించిన చాట్ల రాజు (20) అనే అబ్బాయి ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు.

anjali 1

రోజు ఆ ఇంటికి రావడం.. ఆ అమ్మాయితో మాట్లాడుతుండడం చేస్తుండేవాడు. కొన్ని రోజుల తరువాత ఆమెను ప్రేమిస్తున్న అంటూ వేధించడం స్టార్ట్ చేసాడు. ఈ విషయం ఆమె తల్లికి చెప్పింది. తల్లికూడా రాజుని హెచ్చరించింది. ఇంకోసారి ఇంటికి రాకూడదు అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో రాజు కొన్ని రోజుల పాటు సైలెంట్ అయిపోయాడు. అయితే.. అంజలికి సంబంధాలు చూస్తున్నారు అని తెలియడంతో తిరిగి అంజలికి ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు.

anjali 2

అయితే.. అంజలి తాను ఇంట్లో చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పడం తో రాజుకు కోపం కట్టలు తెంచుకుంది. దీనితో ఎవరు లేని టైం లో అంజలి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో అంజలితో గొడవపడ్డాడు. కోపం లో ఆమెను అక్కడే ఉన్న కత్తి పీటతో హత్య చేసాడు. ఆమె అరుపులు బయటకు వినిపించకుండా ఉండడానికి టివి సౌండ్ ను పెంచాడు.

anjali 3

కొంతసేపటికి ఆమె తల్లితో కలిసి పనిచేసే వ్యక్తి ఉపాధిహామీ జాబ్‌కార్డు ఇవ్వడం కోసం ఇంటికి వచ్చాడు. ఎంత సేపు పిలిచినా ఎవరు పలకకపోవడంతో, మరోవైపు టివి సౌండ్ ఎక్కువగా వస్తూ ఉండడంతో ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న అంజలిని చూసి చుట్టుపక్కలవాళ్ళని పిలుచుకొచ్చాడు. పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అంతలోనే.. రాజు పోలిసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు.


End of Article

You may also like