Ads
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత పాపులారిటీ ఉన్న వారిలో మంత్రి విడదల రజని ఒకరు. అత్యంత చిన్న వయసులోనే మంత్రి అయినవారిగా రికార్డు సృష్టించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అందరిని దాటుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అందం అభినయంతో పాటు మంచి వాక్చాతుర్యమున్న నాయకురాలిగా పేరుగాంచారు.
Video Advertisement
అయితే విడుదల రజనీ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో మొదలైంది.అక్కడ కూడా తక్కువ సమయంలోనే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టిని ఆకర్షించారు. ఓ సమావేశంలో తాను చంద్రబాబు నాటిన మొక్కనని,ఆయన కట్టిన హైటెక్ సిటీలో ఉద్యోగం చేసి, అక్కడి నుంచి అమెరికా వెళ్లి ఈ స్థాయికి వచ్చానని చెప్పుకున్నారు.
తర్వాత 2018 ఎన్నికల్లో తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరి సీనియర్లు అందరినీ దాటుకుని సీటు సంపాదించి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి పొంది అతి తక్కువ వయసులోనే మంత్రి అయిన వారిగా పేరుతెచ్చుకున్నారు. అయితే ఒకసారి విడుదల రజనీ ప్రస్థానాన్ని చూస్తే… విడదల రజిని 1990 జూన్ 24న హైదరాబాదులో జన్మించారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రజనీ మల్కాజ్‌గిరిలోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో 2011లో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశారు.
అనంతరం ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా కొన్నాళ్లు పనిచేసిన రజినికి విడదల కుమారస్వామితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప సంతానం. తర్వాత భర్త కుమారస్వామి తో కలిసి అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఒక ఐటీ కంపెనీ స్థాపించి అతి తక్కువ కాలంలోనే ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. అయితే సొంత ఊరికి తిరిగివచ్చి రాజకీయాల్లోకి రావాలని ఉద్దేశంతో పలు సేవా సంస్థలు స్థాపించి ప్రజలకు సేవ చేసేవారు.
2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై 8,301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో గెలిచిన తొలి బీసీ మహిళగా చరిత్ర సృష్టించారు. శాసనసభ వేదికగా సీఎం జగన్‌పై ఓ రేంజ్‌లో పొగడ్తలు కురిపించే విడదల రజిని,నిత్యం ప్రజల్లో గుంటూరు తనకంటూ ఒక ప్రత్యేకమైన సోషల్ మీడియా టీం ని ఏర్పాటు చేసుకుని తను చేసే కార్యక్రమాలను వైరల్ చేస్తూ ఉంటారు.
End of Article