ఈ బుడ్డోడు మాములోడు కాదు… టీచర్ భుజాల మీద చేతులేసి ముద్దులిచ్చి సారీ చెప్పాడు.!

ఈ బుడ్డోడు మాములోడు కాదు… టీచర్ భుజాల మీద చేతులేసి ముద్దులిచ్చి సారీ చెప్పాడు.!

by Anudeep

Ads

మామూలుగా స్కూల్లో తప్పు చేస్తే ఏం చేస్తారు….. తిట్టడం మహా అయితే ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఓ చిన్నారి తను చేసిన తప్పు తిరిగి చేయను అని టీచర్ ని బతిమిలాడుతూ ఆమెకు ముద్దులిచ్చి మరి క్షమాపణలు చెప్పిన వీడియో ఇప్పుడు నెట్ లో బాగా వైరల్ గా మారింది.

Video Advertisement

ఆ పిల్లాడి అమాయకత్వం టీచర్ బుంగమూతి ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి టీచర్ మేము చదువుకునేటప్పుడు ఉంటే బాగుండు అని కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఈ వీడియోలో ఆ పిల్లాడు తన టీచర్ను ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ఫీట్లు అందరికీ కనువిందు కలిగిస్తూ ఆకట్టుకుంటున్నాయి.

video of a student saying sorry to his teacher goes viral

మామూలుగానే చిన్నపిల్లలు మాట్లాడేది ముద్దు ముద్దుగా ఉంటుంది. అమాయకంగా ఉండే వారి ముఖం చూసి తప్పుచేసినా అందరూ వాళ్ళను కోప్పడకుండా ప్రేమతో దగ్గరకు తీసుకుంటారు. మరి అలాంటిది ఓ బుడ్డోడు తాను చేసిన తప్పును క్షమించమంటూ టీచర్‌కి ముద్దులిస్తూ మళ్లీ ఇలా చేయనంటూ ప్రామిస్ చేయడం చూసి అందరు ఫిదా అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో బాగా ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియోకి ఇప్పటి వరకు పద్నాలుగు లక్షలకుపైగా వ్యూస్, వేలాది లైకులు వచ్చాయి అంటే ఆలోచించండి ఈ వీడియో ప్రస్తుతం ఎంత పాపులర్ అయ్యిందో.

video of a student saying sorry to his teacher goes viral

ఈ వీడియో బిహార్‌ చాప్రా జిల్లాలోని ఓ స్కూల్‌లో జరిగిన సంఘటన. ట్విట్టర్ లో పోస్ట్ ఆయిన ఈ వీడియో పై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు.తిరిగి తప్పు చేయనంటూ టీచర్ దగ్గరకు వచ్చి ఆ చిన్నారి దీనంగా బతిమిలాడడం, ఆ టీచర్ బుంగమూతి పెట్టడం, మళ్ళీ కొద్ది సేపటి తర్వాత టీచర్‌ను హత్తుకొని ఆ పిల్లాడు ముద్దు పెట్టడం. దానికి ఆ టీచర్ పక్కాగా అంటే అవును మేడం పక్కా.. మళ్లీ ఈసారి అలా చేయను అని ముద్దు ముద్దుగా ఆ బుడతడు బుదులివ్వడం ఈ వీడియో సారాంశం.

video of a student saying sorry to his teacher goes viral

గురు శిష్యుల మధ్య ఉండే తల్లి బిడ్డల అనుబంధాన్ని ఈ వీడియో లో చూసి అందరూ ఆనందిస్తున్నారు. పిల్లలు అమాయకులు, వారివి లేత హృదయాలు…..వాటిని మంచిగా మలచ వలసిన భాధ్యత టీచర్స్ పైన ఎంత ఉందో ఈ వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చు.

watch video :


End of Article

You may also like