ఇటీవల వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుతలై పార్ట్‌-1 రిలీజ్‌ అయింది. కమెడియన్‌ సూరి, విజయ్‌ సేతుపతి ఈ మూవీ లో ప్రధాన పాత్రల్లో నటించారు. అక్కడ ఈ సినిమా తమిళ బాక్సాఫీస్‌ ను షేక్ చేసింది. రెండు రోజుల్లోనే పది కోట్ల రేంజ్‌ కలెక్షన్‌ను సాధించింది ఈ చిత్రం. ఈ సినిమాకి మంచి స్పందన మాత్రమే కాదు విమర్శకుల ప్రశంసలు సైతం లభించాయి.

Video Advertisement

 

 

దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల పార్ట్‌ 1 గా విడుదల చేసారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా ఈ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమా చూస్తే చలించని వ్యక్తి ఉండడు అంటే అతిశయోక్తి ఉండదు. అంత నేచురల్ గా ‘విడుదల-1’ ని వెట్రిమారన్ తీర్చిదిద్దాడు. అట‌వీ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం కథలో… గిరిజ‌నుల‌పై పోలీసుల జులూంని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు.

viduthalai movie telugu closing colletions..!!

ఏప్రిల్ 15న తెలుగులో విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. పలువురు సినీ ప్రముఖులు సైతం సినిమా బాగుందంటూ కితాబిచ్చారు. అయితే ‘విడుదల-1’ రూ.1.5 కోట్ల షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టు. అయితే ఊహించని విధంగా ఈ మూవీ ఫుల్ రన్లో రూ.0.81 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో ఇది డిజాస్టర్ గా నిలిచింది. మొదటి పార్ట్ కు ఇలాంటి రిజల్ట్ రావడంతో.. రెండో పార్ట్ ను తెలుగులో రిలీజ్ చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

viduthalai movie telugu closing colletions..!!

ఇక మరో వైపు విడుదల పార్ట్‌ 1 ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తమిళ వెర్షన్ ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 ఓటిటి లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతోంది. తెలుగు వెర్షన్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా విడుదల పార్ట్ 1 మూవీ వేగంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సొంతం చేసుకున్న మూవీగా రికార్డు అందుకుందని జీ 5 తమిళ్ నిర్వాహకులు తాజాగా ప్రకటించారు.