Ads
ఆ భర్త కి భార్య అంటే వల్లమాలిన ప్రేమ. తనను కంటికి రెప్పలా చూసుకున్న అర్ధాంగి కళ్ళ ముందు లేకపోవడాన్ని ఆ భర్త జీర్ణించుకోలేకపోయాడు. దీనితో, ఆమె శవం పక్కనే పెట్టుకుని పడుకుంటున్నాడు. ఇతని స్టోరీ చూపరులను కలచివేస్తోంది. వివరాల్లోకి వెళితే.. వియాత్నం కు చెందిన లీ అనే వ్యక్తి తన భార్య చనిపోయినా మర్చిపోలేక పోతున్నాడు.
Video Advertisement
అతను తన భార్యను మరచిపోలేక చాలా రోజుల పాటు స్మశానం వద్దకే వెళ్ళేవాడు. చాలా రోజుల పాటు స్మశానం వద్దకు వెళ్లి భార్య సమాధి పక్కనే పడుకునేవాడు. ఓ రోజు వర్షం కురవడం తో.. అతను అక్కడ ఉండలేకపోయాడు. దీనితో, ఆ భర్త ఆ సమాధి పక్కనే ఒక సొరంగాన్ని కూడా తవ్వేసి అందులో ఉండడం మొదలుపెట్టాడు. ఇలా చేసిన చాలా రోజులకు లీ పిల్లలకు ఈ విషయం తెలిసింది.
తమ తండ్రిని వారు ఆ స్థితి లో చూడలేకపోయారు. అతని తండ్రికి నచ్చ చెప్పి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చినా.. లీ మామూలు మనిషి కాలేకపోయాడు. తిరిగి స్మశానం వద్దకే వెళ్లి.. సమాధి తవ్వి అస్థికలను బయటకు తీసాడు. వాటిని తెచ్చుకుని ఇంట్లోనే బెడ్ రూమ్ లో పెట్టుకుని నిద్రించేవాడు.
అతని అవస్థ ని చూసిన పిల్లలు చలించిపోయారు. లీ భార్య అస్థికలు కుళ్లిపోయిన స్థితి లో ఉన్నాయి. దీనితో, లీ వాటికి జిగురు, ఇసుక, సిమెంటు, ప్లాస్టర్ ఆఫ్ పారీస్ వంటి పదార్ధాలతో కలిపి ఓ మహిళ బొమ్మను తయారు చేయించాడు. ఆ బొమ్మలోనే తన భార్య ను చూసుకుంటూ.. ఆమె బ్రతికే ఉందనుకుని బతికేస్తున్నాడు.
End of Article