“అది చూసి ఏడ్చేశాను..!” విజయ్ దేవరకొండ ఎమోషనల్ ట్వీట్..!

“అది చూసి ఏడ్చేశాను..!” విజయ్ దేవరకొండ ఎమోషనల్ ట్వీట్..!

by Anudeep

Ads

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పాన్ ఇండియా మూవీ లైగర్ ని తెరకెక్కిస్తున్నారు. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. అనన్య పాండే హీరోయిన్ కాగా చార్మీ, పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Video Advertisement

ఆగస్ట్ 25న లైగర్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అందులో భాగంగా ప్రచారంలో స్పీడ్ పెంచింది చిత్ర బృందం. మొన్న విడుదల చేసిన విజయ్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. అయితే నిన్న ఈ సినిమా నుంచి అక్డీ పక్డీ అనే పాటను రిలీజ్ చేశారు. దీనికి కూడా యూట్యూబ్ లో మంచి స్పందన వస్తుంది.

అయితే ఆ సాంగ్ ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ విజయ్ ఇలా రాసుకొచ్చాడు.. కొరియోగ్రఫీ చూస్తే ఏడుపొచ్చింది కానీ తర్వాత షూటింగ్ లో బాగా ఎంజాయ్ చేసాను అన్నాడు. లైగర్ షూటింగ్ దాదాపుగా ముంబైలోనే జరిగింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విడుదలకు ఇంకో నెల రోజులే ఉండడంతో అటు పూరీ ఫ్యాన్స్, ఇటు విజయ్ ఫ్యాన్స్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విజయ్ చేసిన ట్వీట్ కింద ఇవ్వబడింది.


End of Article

You may also like