నాగ బాబు వివాదాస్పద ట్వీట్స్ కి ‘రాములమ్మ’ కౌంటర్ ?

నాగ బాబు వివాదాస్పద ట్వీట్స్ కి ‘రాములమ్మ’ కౌంటర్ ?

by Anudeep

Ads

మెగా బ్రదర్ యాక్టర్ & పోలిటేషన్ ‘నాగబాబు’ గారు ఏమి చేసిన సంచలనమే అవుతున్నాయి.సోషల్ మీడియా తరచూ పోస్ట్లు పెడుతూ ఎప్పుడు అభిమానులతో టచ్ లో ఉండే ఆయన ప్రభుత్వాల మీద ఆయన నిరసన గళాన్ని సామజిక మాధ్యమాల ద్వారా తరచూ వినిపిస్తూ ఉంటారు.ఇటీవలే అయన జనసేన లో చేరిన సంగతి తెలిసిందే..’జబర్దస్త్’ ని వదిలి ‘అదిరింది’ షో కి మారిపోవటం అది కూడా ఒక సంచలనమే ఇలా ఆయన ఏమి చేసిన ఒక సెన్సేషన్ గా నిలుస్తుంది.

Video Advertisement

తాజాగా ఆయన నాధురాం గాడ్సే పుట్టిన రోజు సందర్బంగా చేసిన ట్వీట్స్ పెద్ద దుమారమే చెలరేగాయి.అటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశగా నిలిచాయి.ఇంతకీ ఆయన ట్వీట్ సారాంశం ఏంటంటే..’ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే.ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు.కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే…మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.’ అంటూ ట్వీట్స్ చేసారు..అంతే ఈ ట్వీట్స్ కాస్త చాల వివాదాస్పదంగా మారాయి.

అటు నాగ బాబు ట్వీట్స్ కొనసాగుతుండగానే మరో వైపు లేడీ అమితాబ్ ‘విజయశాంతి’ కూడా కౌంటర్ గా ట్వీట్స్ పెట్టారు. నాగ బాబు గారి పేరుని ఎక్కడ పైకి చెప్పకపోయినా ఆమె చేసిన ట్వీట్స్ ని చూస్తే ఎవరికైనా అనుమానం రాక మానదు,కుల, మతాలు వేరైనా దైవం ఒక్కటే.. ఎన్ని తరాలైనా జాతిపితా ఒక్కడే… 130 కోట్ల మంది భారతీయులకు మహత్ముడు ఒక్కడే… ఈశ్వర్, అల్లా… తేరానామ్… సబ్ కో సన్మతి దే భగవాన్. ”నాకు కూడా”…”అని”గాడ్సే, ఇప్పుడు బ్రతికుంటే… ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్ధించేవాడు. మన్నించండి మహత్మా అంటూ విజయశాంతి ట్వీట్‌ చేసారు..

 

 

 


End of Article

You may also like