విజయ్ కన్నా ముందు లియోలో ఆ హీరోని అనుకున్నారా….!

విజయ్ కన్నా ముందు లియోలో ఆ హీరోని అనుకున్నారా….!

by Mounika Singaluri

Ads

ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం లియో. ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. LCU లో వచ్చిన ఈ మూవీ పైన ముందు నుండి కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.

Video Advertisement

అయితే ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ లోకేష్ కనగరాజు మాట్లాడుతూ… వాస్తవానికి నేను ఐదు సంవత్సరాల క్రితం వేరే హీరోని దృష్టిలో పెట్టుకుని ఈ లియో కథను రూపొందించాను. అయితే కాస్టింగ్ కార్యరూపం దాల్చలేదు. మాస్టర్ లో విజయతో కలిసి పనిచేసిన తర్వాత ఆయన నటన సామర్ధ్యాలను ఎలివేట్ చేయడానికి ఆయనతో కలిసి ఈ లియో సినిమాను చేసినట్లుగా తెలిపారు.

leo movie review

అయితే లియో పాత్ర కోసం మొదట అనుకున్న హీరో ఎవరనేది మాత్రం లోకేష్ చెప్పలేదు కానీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ బయట బాగా వైరల్ అవుతుంది. ముందు అనుకున్న హీరో ఎవరు అంటూ అభిమానులు ఎంక్వైరీలు చేయడం మొదలుపెట్టారు. లోకేష్ సన్నిహితులను కూడా ఈ విషయం గురించి ఆరా తీస్తున్నారు అంట. అయితే బయటికి చెప్పడం లేదు కానీ ముందు అనుకున్న హీరో కమల్ హాసన్ అని టాక్ ఉంది.

కమలహాసన్ రిజెక్ట్ చేసిన తర్వాతనే విక్రమ్ స్టోరీని ఓకే చేశారని చెబుతున్నారు. ఇక సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పైన ఎంతో భారీ స్థాయిలో లోకేష్ కనగరాజు లియో మూవీ తెరకెక్కించగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం బాగా ప్లస్ అయ్యింది. లియో మూవీకి సక్సెస్ మీట్ కూడా చేయనున్నట్లు చెబుతున్నారు కానీ మేకర్స్ నుండి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు.

 

Also Read:మెగా వారి పెళ్లిలో కలుసుకోనున్న చైతన్య, సమంత..


End of Article

You may also like