Ads
తమిళ సీనియర్ హీరో, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్ అనారోగ్యంతో గురువారం నాడు (డిసెంబర్ 28) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన 150కి పైగా చిత్రాలలో నటించి, మెప్పించారు. విజయ్‌కాంత్ తమిళ సినిమాలలో మాత్రమే నటించారు.
Video Advertisement
ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేయగా, విజయం సాధించాయి. ఆ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు విజయ్ కాంత్ చేరువయ్యారు. విజయ్‌కాంత్ నటించిన పలు చిత్రాలను తెలుగులో రీమేక్ చేశారు, వాటి వాటిద్వారా మన హీరోలు హిట్ అందుకున్నారు. ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. చట్టానికి కళ్ళు లేవు :
విజయ్‌కాంత్ ని కోలీవుడ్ లో స్టార్ హీరోగా నిలబెట్టిన మూవీ ‘సట్టం ఒరు ఇరుత్తరై’. ఈ సినిమాకి కోలీవుడ్ స్టార్ హీరో విజయ దళపతి తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ మూవీని తెలుగులో చిరంజీవి హీరోగా ‘చట్టానికి కళ్ళు లేవు’ పేరుతో రీమేక్ చేశారు.
2. మంచిమనసులు:
తమిళంలో విజయ్ కాంత్ రేవతి జంటగా నటించిన వైదేగి కతిరున్తల్ 1984లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీని తెలుగులో భాను చందర్ హీరోగా మంచిమనసులు పేరుతో మోహన్ గాంధీ రీమేక్ చేశారు.
3. ఖైదీ నెంబర్ 786:
విజయ్ కాంత్, రాధ జంటగా నటించిన హిట్ మూవీ ‘అమ్మన్ కోవిల్ కిజకాలే’. ఈ చిత్రాన్ని ఖైదీ నెంబర్ 786 పేరుతో చిరంజీవి హీరోగా రీమేక్ చేశారు. ఇందులో భానుప్రియ హీరోయిన్ గా నటించగా, విజయ్ బాపినీడు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విజయం సాధించింది.
4. దేవాంతకుడు:
విజయ్ కాంత్ హీరోగా ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘వెట్రి’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ మూవీలో చిరంజీవి, విజయశాంతి నటించారు.
5. నేనే రాజు నేనే మంత్రి:
ఈ పేరు వింటే రానా మూవీ గుర్తుకు వస్తుంది. 1987లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా నేనే రాజు నేనే మంత్రి మూవీ వచ్చింది. ఈ చిత్రం విజయకాంత్ నటించిన తమిళ సినిమా ‘నన్నే రాజా నన్నే మంత్రి’ కు రీమేక్.
6. ధర్మతేజ:
1988లో విజయ్ కాంత్ హీరోగా నటించిన సినిమా ‘పూంతొట్టా కావల్కరన్’. ఈ మూవీ కృష్ణంరాజు హీరోగా ధర్మతేజ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు.
7. దొంగపెళ్ళి:
1987లో వచ్చిన విజయ్ కాంత్ సూపర్ హిట్ మూవీ ‘నినైవే ఒరు సంగీతం’. ఈ సినిమాని శోభన్ బాబు హీరోగా దొంగపెళ్ళి టైటిల్ తో రీమేక్ చేశారు. ఈ మూవీలో సుమలత, విజయశాంతి హీరోయిన్లుగా నటించారు.
8. చినరాయుడు:
విక్టరీ వెంకటేష్ హీరోగా, విజయశాంతి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీకి దర్శకుడు బి.గోపాల్. ఈ మూవీ 1992 లో విజయ్ కాంత్ నటించిన చిన్న గౌండర్ మూవీకి రీమేక్.
9. నా మొగుడు నాకే సొంతం:
మోహన్ బాబు హీరోగా వాణి విశ్వనాధ్, జయసుధ నటించిన నా మొగుడు నాకే సొంతం మూవీ 1989లో విజయ్ కాంత్ హీరోగా నటించిన ‘ఎన్ పురుషన్ తన్ ఎనక్కు మట్టుమ్తాన్’ కు రీమేక్.
10. గమ్యం:
1992లో సూపర్ హిట్ అయిన విజయ్ కాంత్ తమిళ మూవీ ‘భరతన్’. ఈ మూవీని తెలుగులో శ్రీకాంత్ హీరోగా గమ్యం పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీలో రవళి హీరోయిన్ గా నటించింది.
11. ఠాగూర్:
వి.వి.వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఠాగూర్ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ మూవీ 2002 లో విజయ్ కాంత్ నటించిన ‘రమణ’మూవీకి కి రీమేక్. ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహించారు.
12. మా అన్నయ్య:
2000లో విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా ‘వనతైప్పోల’. ఈ సినిమాని తెలుగులో రాజశేఖర్ హీరోగా మా అన్నయ్య టైటిల్ తో రీమేక్ చేశారు. ఈ సినిమాకి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా, మీనా, మహేశ్వరి, ప్రీతి హీరోయిన్లుగా నటించారు.
13. ఖుషి ఖుషీగా:
2004 లో విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఎంగల్ అన్న’. ఈ సినిమాని తెలుగులో ఖుషి ఖుషీగా పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీలో జగపతి బాబు, వేణు, రమ్యకృష్ణ, నిఖిత ప్రధాన పాత్రలలో నటించారు.
Also Read: విజయ్‌కాంత్ హీరో నుండి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగారు..? అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారు..?
End of Article