ఒకవైపు కరోనా భయంతో ప్రజలు అల్లల్లాడుతుంటే, మరో వైపు లాక్ డౌన్ తో పనులు లేక ఆకలితో అలమటిస్తున్న ప్రాణాలెన్నో.. అలాంటి వారి అవసరాలు తెలుసుకుని చిన్నాపెద్దా తేడాలేకుండా అహర్నిశలు కష్టపడుతూ తమ వంతు సాయం చేస్తున్నారు అనేకమంది. అటువంటిది “అమ్మా.. ఆకలి అంటూ” అడిగిన తర్వాత కూడా ఎవరైనా ఊరికే ఉండగలుగుతారా?? అర్దరాత్రి అపరాత్రి అని చూడకుండా ఆకలి అని కాల్ రాగానే వలసకూలీల ఆకలి తీర్చింది.. మహిళా పోలీస్ అధికారి..
Video Advertisement
ఒకవైపు డాక్టర్లు ప్రత్యక్షంగా కరోనాతో పోరాడుతుంటే , మరోవైపు ప్రజలందరూ లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ,కరోనా వ్యాప్తి చెందకుండా చూడడంలో పోలీసులు ఎంత తలమునకలై పని చేస్తున్నారో తెలిసిన విషయమే..ప్రతి రోజు లానే ఆరోజు కూడా డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్నారు విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి. రాత్రి 11.30 గంటల అప్పుడు ఫోన్ రింగైంది..ఈ టైమ్లో ఏ ఎమర్జెన్సి అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేశారు రాజకుమారి.. అమ్మా, ఆకలేస్తుంది అంటూ అవతల ఉన్న మహిళ చెప్తూ పోతుంది.. ఆవిడ మాటల్లో వాళ్లు పదిమంది చెక్ పోస్టు దగ్గర ఉన్నారని అర్దం అయింది.
వెంటనే అసిస్టెంట్స్ కి ఫోన్ చేసి వారికి ఫూడ్ విషయం చూడమంది..ఈ టైమ్ లో ఏం దొరకవు అంటూ వాళ్లు సమాధానం చెప్పారు.. దాంతో తన వల్ల కాదని ఊరికే ఉండలేకపోయింది. ఇంట్లో ఏమన్నా ఉన్నాయోమో చూద్దామని కిచెన్లోకి వెళ్లి చూస్తే నిమ్మకాయలు మాత్రమే కనపడ్డాయి..వెంటనే రైస్ పెట్టేసి, ఆ నిమ్మకాయలతో పులిహోర చేసి, ఆ ఫూడ్ ని తీసుకుని చెక్ పోస్టు దగ్గరకు వెళ్లింది..తీరా చూస్తే అక్కడ వాళ్లు లేరు..తనకొచ్చంది ఫేక్ కాల్ ఆ అని కాసేపు డౌట్ వచ్చింది.. ఎంక్వైరీ చేస్తే..అక్కడున్న వారిని క్వారంటైన్ సెంటర్ కి తరలించారని తెలియడంతో ఫూడ్ పట్టుకుని అక్కడకు వెళ్లి వారికి ఇచ్చి, వారి ఆకలి తీర్చింది.
వాళ్ల భోజనం అయ్యాక అప్పుడు వారి గురించి ఆరా తీస్తే “గత మూడు రోజుల క్రితం మేము నెల్లూరు జిల్లా సూళ్లురుపేట నుంచి బయల్దేరాము. మధ్యలో మాకు ఎక్కడ కూడా ఆహారం దొరకలేదు. తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. విజయనగరం చెక్ పోస్ట్ దగ్గర తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అనుకున్నాము..కానీ ఏం దొరకలేదు, ఏం చేయాలో పాలుపోక మీకు ఫోన్ చేసాము అని జరిగిందంతా చెప్పుకొచ్చారు.
ఇంతకీ ఎస్పీ నంబర్ వారి దగ్గర ఎక్కడిది అనే డౌటొచ్చిందా?? అదే డౌట్ తో రాజకుమారి వారిని ప్రశ్నించగా.. నెల్లూరులో బయల్దేరినప్పుడే ఒక పెద్దాయన మధ్యమధ్యలో వచ్చే చెక్ పోస్టులు, పోలీస్ స్టేషన్ నంబర్లు, కలెక్టర్ నంబర్ తో సహా అన్ని నెంబర్లూ రాసిచ్చారట..ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయమని.. ఆ నంబర్లు వారిక ఆ రాత్రి అలా సహాయపడ్డాయి… ఈ టైంలో ఏం దొరకవు అని అందరిలా ఊరుకోకుండా , మూడురోజులుగా నడుస్తూ వస్తూ , అమ్మా , ఆకలి అనగానే ఆ వలసకూలీల ఆకలి తీర్చారు..రియల్లీ హ్యాట్సాఫ్ మేడమ్.