Ads
- చిత్రం : విజయానంద్
- నటీనటులు : నిహాల్,అనంత్ నాగ్, రవిచంద్రన్, భరత్ బోపన్న, అనీష్ కురువిల్ల, ప్రకాష్ బేలావాడి,సిరి ప్రహ్లాద్
- నిర్మాత : VRL ఫిలిం ప్రొడక్షన్స్, ఆనంద్ సంకేశ్వరన్
- దర్శకత్వం : రిషిక శర్మ
- సంగీతం : గోపీ సుందర్
- విడుదల తేదీ : డిసెంబర్ 9 , 2022
స్టోరీ :
Video Advertisement
కన్నడ నాట VRL ట్రావెల్స్ వ్యవస్థాపకుడు విజయ్ సంకేశ్వరన్ బయోపిక్ ఈ విజయానంద్. ఆయనతో పాటు ఆయన కుమారుడు ఆనంద్ సంకేశ్వర్ పేరు కలిపి తన కంపెనీకి విజయానంద్ రోడ్ లైన్స్ అనే కంపెనీ స్థాపించారు. ఆయన జీవితం లోని కీలక ఘట్టాల సమాహారమే ఈ చిత్రం.
కథ విషయానికొస్తే.. విజయ్ సంకేశ్వరన్ తండ్రి ఒక మామూలు ప్రింటింగ్ ప్రెస్ యజమాని. ఆ ప్రింటింగ్ ప్రెస్ లో పని చేయడం ఇష్టం ఉండని విజయ్.. సొంతం గా ఒక లారీ కొనుక్కొని వ్యాపారం చేయాలి అనుకుంటాడు. తన తండ్రికి ఇష్టం లేకపోయినా తానూ అనుకున్న దారిలోనే వెళ్తాడు విజయ్.
ఈ క్రమంలో ఒక్క ట్రక్కుతో మొదలైన ఆయన ప్రస్థానం దాదాపు 5 వేలకు ట్రక్కుల యజమాని అవుతాడు.45 ఏళ్లలోనే కర్ణాటకలో అగ్ర వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. ఈ క్రమంలో ఈయన ఒక పత్రికను కూడా స్థాపిస్తారు. అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి ? చివరకు తాను నమ్ముకున్న దారిలో ఎలా విజయాన్ని సొంతం చేసుకున్నాడనేదే విజయానంద్ మూవీ స్టోరీ.
రివ్యూ :
ఒక వ్యక్తి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలంటే అందులో కావాల్సింత ఎమోషన్,ఇన్‌స్ప్రేషన్, మోటివేషన్ ఉండాలి. అవన్ని ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ సంకేశ్వర్ జీవితంలో ఉన్నాయి. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘనలను దాదాపు 2 గంటల పాటు ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టడంలో ఓ దర్శకురాలిగా రిషికా శర్మ సక్సెస్ అయింది. బయోపిక్ కాబట్టి.. సినిమా మొత్తం సీరియస్‌గా సాగిపోతూనే ఉంటుంది. ఓ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా ఆకట్టుకోలేకపోవచ్చు.
ఈయన రాజకీయ జీవితం గురించి పూర్తిగా ప్రస్తావించకుండా.. కేవలం విజయ వాణి పత్రికతో మళ్లీ పత్రికా రంగంలో కర్ణాకటలో నెంబర్ వన్‌గా ఎలా ఎదిగారు అన్న దాన్ని చూపిస్తూ సినిమాను ఎండ్ చేసారు. సినిమా ఫోటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, గ్రాఫిక్స్ బాగున్నాయి. నిర్మాత ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు.
సీరియల్ నటుడిగా, యాంకర్‌గా చేసిన నిహాల్ విజయ్ సంకేశ్వర్ పాత్రలో జీవించేసారు. ఆయన తండ్రి పాత్రలో నటించిన అనంత్ నాగ్ చాలా బాగా చేసారు. ఆయన కొడుకుగా చేసిన భరత్ బోపన్న కూడా ఆకట్టుకుంటారు. ఇక ఈ సినిమాలో రామారావు అనే పత్రిక యజమాని పాత్రలో నటించిన ప్రకాష్ బేలావాడి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సినిమాలో తన నటనతో డామినేట్ చేసాడు. మిగిలిన నటులు పాత్ర పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్ :
- కథ
- నిహాల్, ప్రకాష్ బేలావాడి, అనంత్ నాగ్ నటన
- నిర్మాణ విలువలు
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
- సెకండాఫ్ లో కొన్ని సీన్లు
- ఎడిటింగ్
- సీరియస్‌గా సాగే కథనం
రేటింగ్ : 3 /5
ట్యాగ్ లైన్ : కొందరికి మాత్రమే నచ్చే ప్రేరణాత్మక చిత్రం.
End of Article