Ads
సాధారణంగా తెలుగు హీరోయిన్లకి జాతీయ అవార్డు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అలా జాతీయ అవార్డ్ సంపాదించుకున్న మన తెలుగు నటి విజయశాంతి గారు. విజయశాంతి గారి కుటుంబం రామగుండంలోని ఎటుర్నగరంకి చెందిన వారు. విజయశాంతి గారు చెన్నైలోని హోలీ ఏంజెల్స్ ఆంగ్లో-ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్ లో పదవ తరగతి చదువుకున్నారు.
Video Advertisement
1980 లో వచ్చిన కళ్లుక్కుల్ ఈరమ్ అనే తమిళ సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టారు విజయశాంతి గారు. అదే సంవత్సరం విడుదలైన కిలాడి కృష్ణుడు అనే సినిమా తెలుగులో విజయశాంతి గారి మొదటి సినిమా. ఆ తర్వాత పండంటి జీవితం, సత్యం శివం, వంశ గౌరవం, కృష్ణావతారం, శ్రీరంగనీతులు, నేటిభారతం తో పాటు ఇంకా ఎన్నో తమిళ సినిమాల్లో, అలాగే తెలుగు సినిమాల్లో నటించారు.
1989 లో వచ్చిన ఈశ్వర్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు విజయశాంతి గారు. అప్పుడు ఉన్న స్టార్ హీరోలందరితో నటించారు. విజయశాంతి, చిరంజీవి కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. అయితే 2006 లో నాయుడమ్మ సినిమాలో కనిపించిన విజయశాంతి గారు, మళ్లీ 2020 లో సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.
ఈ సినిమాలో ప్రొఫెసర్ భారతిగా నటించారు విజయశాంతి గారు. 1990 లో భారత ప్రభుత్వం, విజయశాంతి గారిని కర్తవ్యం సినిమాలో తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డుతో సత్కరించింది. అలాగే ఎన్నో ఫిలింఫేర్ అవార్డులని, నంది అవార్డులని కూడా అందుకున్నారు విజయశాంతి గారు.
విజయశాంతి గారు 1988 లో ఎమ్. వి. శ్రీనివాస్ ప్రసాద్ గారిని పెళ్లి చేసుకున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ గారు హైదరాబాద్, చెన్నై లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. అలా ఎన్నో సంవత్సరాల నుండి తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారి కొన్ని అన్ సీన్ ఫోటోలని ఇప్పుడు చూద్దాం.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19#20
End of Article