వైభవంగా ‘రోడ్డు’ పెళ్లి చేసిన గ్రామస్థులు.. ఎక్కడ అంటే..? అసలెందుకు చేసారంటే.?

వైభవంగా ‘రోడ్డు’ పెళ్లి చేసిన గ్రామస్థులు.. ఎక్కడ అంటే..? అసలెందుకు చేసారంటే.?

by kavitha

Ads

ఓ గ్రామంలోని వారంతా ఒక్కటై, పెళ్లికి వచ్చిన అతిథులకు వడ్డించడానికి రుచికరమైన బిర్యానీని, నోరూరించే స్వీట్లతో విందు భోజనాలు సిద్ధం చేశారు. పెళ్లి కోసం బాజభజంత్రీలు రాగానే  కానియ్యండి అంటూ అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు.

Video Advertisement

అయితే గ్రామస్తులందరు కలిసి పెళ్లి జరిపించింది. మనుషులకో, జంతువులకో కాదు. పెళ్లి జరిపించింది రోడ్డుకు. ఇలా అందరు కలిసి రోడ్డుకు పెళ్లి చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ గ్రామం ఏమిటో? ఈ పెళ్లి జరిపించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రోడ్డుకి అంగరంగ వైభవంగా పెళ్లి చేసిన గ్రామం పేరు కొడియాత్తూరు. ఈ గ్రామం కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌ జిల్లాలో ఉంది.  కొడియాత్తూరు గ్రామంలో రోడ్డు సమస్య ఎక్కువగా ఉంది. పన్నెండు వందల మీటర్ల పొడవు మరియు మూడున్నర మీటర్ల వెడల్పు కలిగి ఉన్న రోడ్డును 1980 లో నిర్మించారు. అయితే ఈ రోడ్డును అప్పడు గ్రామంలో ఉన్న జనాభాకు తగ్గట్టు నిర్మించారు.  కానీ ఇప్పుడు ఆ గ్రామం పెద్దదిగా మారడంతో రోడ్డు చాలా ఇరుకుగా మారింది.

ప్రస్తుతం ఆ గ్రామంలో ఉంటున్నవారి సంఖ్య మూడు రెట్లు పెరగడం, ఆ రోడ్డు చిన్నగా ఇరుకుగా మారడంతో ఆ గ్రామస్తులకు  ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. రోడ్డును విస్తరించడానికి చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి. రోడ్డు విస్తరించాలని ప్రయత్నించినప్పుడల్లా ఏదో ఒక ఆటంకం ఏర్పడి , ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలించలేదు.  అయితే రోడ్డు విస్తరించాలంటే గ్రామంలోని కొన్ని కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో గ్రామస్తులంతా ఏం చేయాలా అని మదనపడ్డారు. చివరికి వారంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు.

అందులో భాగంగా ‘కొడియాత్తూరు వికాస సమితి’ పేరుతో ఒక సంఘాన్ని స్థాపించారు. ఆ తరువాత రోడ్డు విస్తరణలో ఇంటిని  కోల్పోయే వారికి ఎంత పరిహారం, రోడ్డు విస్తరణకు అయ్యే ఖర్చు ఎంత అనేది అంచనా వేశారు. మొత్తం కలిపి 60 లక్షల రూపాయల ఖర్చవుతుందని లెక్క వేశారు. విరాళాలల రూపంలో గ్రామంలోని 15 మంది కలిపి 15 లక్షల రూపాయలు విరాళంగా  ఇచ్చారు. మిగిలిన 45 లక్షల రూపాయల గురించి ప్రయత్నించారు. అలాంటి టైమ్ లోనే గ్రామస్తులకు గత సంప్రదాయం జ్ఞాపకం వచ్చింది.  అదే కురి కల్యాణం. ఉత్తర శతాబ్దాల క్రితం కురి కల్యాణం ద్వారా ఒకరికొకరు సహకరించుకుని ఆర్థికంగా తోడ్పడేవారు.

ఇక రోడ్డు విస్తరణకు కోసం కురి కల్యాణం నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం (ఫిబ్రవరి 25 ) నాడు గ్రామస్తులంతా రోడ్డుకు పెళ్లి చేశారు. అంటే గ్రామంలోని ప్రజలంతా కలిసి సామూహికంగా భోజనాలు చేసి, ఆ తరువాత చదివింపులు చేస్తారు. భోజనం చేసిన తరువాత ఎవరికి తోచినంతా వారు సాయం చేస్తారు. ఈ పెళ్ళికి గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కూడా వచ్చారు. ఈ పెళ్లి వల్ల వచ్చిన డబ్బును ఉపయోగించ, రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు.

Also Read: ఒక్క నెలలో అయోధ్య రామునికి ఎన్ని కోట్ల విరాళాలు వచ్చాయో తెలుసా? ఎన్ని లక్షల మంది దర్శించుకున్నారు అంటే.?


End of Article

You may also like