Ads
నటుడు రఘువరన్.. ఎక్కువగా విలన్ పాత్రలు చేస్తూ ప్రత్యేకంగా కనిపిస్తుంటారు. ఆయన విలన్ పాత్ర ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా ఉంటుంది.
Video Advertisement
విలన్ అనే మాటకు ఆయన కొత్త అర్థాన్ని తీసుకువచ్చారు. ఆయన మొదట చేసిన సినిమా మెగాస్టార్ చిరంజీవి ప్రతివాడి ప్రాణంలో వికలాంగుడైన విలన్ పాత్రలో ఆయనను చూసి మంచి నటుడు అని అన్నారు.
కానీ శివ చిత్రం తర్వాతే రఘువరన్ తెలుగులో మంచి పేరు సంపాదించారు. భయంకరమైన అరుపులు, కేకలతో సాగిపోతున్న విలన్ పాత్ర లకు రఘువరన్ అడ్డుకట్ట వేసారని చెప్పవచ్చు. ట్రెండ్ కు అనుగుణంగా నటిస్తూ ఆధునిక శైలిలో మాట్లాడుతూ తేనె పూసిన కత్తి లాంటి విలన్ గా కనిపించడం రఘువరన్ పద్ధతి.
రఘువరన్ సొంత ఊరు కోయంబత్తూర్. ఆయన విద్యాభ్యాసం చిన్నతనమంతా అక్కడే గడిచింది. వాళ్ళ నాన్న హోటల్ వ్యాపారం. సాయంత్రం కాలేజ్ నుంచి రాగానే హోటల్లో కూర్చోమని చెప్పేవారు. కానీ రఘువరన్ ఎప్పుడూ ఆ పని చేయలేదు. బీ ఏ సైకాలజీ చేసిన ఆయనకు ఏదో సాధించాలని ఉండేది. డిగ్రీ పూర్తయిన తర్వాత మద్రాసు వచ్చి ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేరారు.
ఆ తర్వాత తమిళ్ లో ఒక సినిమా చేసి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు తెలుగు ఇండస్ట్రీలో తొలి చిత్రం కాంచన సీత, దర్శకరత్న దాసరి నారాయణరావు ఈయన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. తర్వాత మిస్టర్ భరత్, ఆయన నటించిన పూర్తి గుర్తింపు తెచ్చిన సినిమా పసివాడి ప్రాణం. ఆయనకు చాలా గుర్తింపు నిచ్చిన సినిమా శివ.
ఈ సినిమాతో ఎంతో పాపులారిటీ సంపాదించిన ఆయన తెలుగు, తమిళం, హిందీ, మలయాళ చిత్రాల్లో దాదాపుగా 200 సినిమాలు చేశారు. కేవలం విలన్ గానే కాకుండా సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ కు తండ్రిగా నటించారు. ఒకే ఒక్కడు చిత్రంలో ముఖ్యమంత్రి గా నటించారు. ఆయన వయసుకు మించిన పాత్రే అది.
అయినా ఛాలెంజ్ గా తీసుకొని దాని కోసం చాలా కష్టపడి అందులో నటించడం కాదు జీవించి పోయాడు. కానీ ఆయనకు కొన్ని చెడు అలవాటు ఉండేది. సారా పొట్లం నుంచి స్టార్ హోటల్ లో దొరికే కాస్ట్లీ మద్యం వరకు ఏది వదిలిపెట్టేవాడు కాదు. అమ్మాయిల వెంట తిరిగే వారట. ఏది చేయాలి అనిపిస్తే అది భయపడకుండా చేసేవారట. ఈ విషయాన్ని తానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అటువంటి వ్యక్తి పూర్తిగా మారిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
మందు కాదు కదా సిగరెట్ కూడా మానేశారు. దానికి కారణం ఆయన జీవితంలోకి ప్రవేశించిన రోహిణి. వీరి వివాహం రహస్యంగా జరగటం గమనార్హం. ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే 2004లో రఘువరన్ రోహిణి విడిపోయారు. వీరిద్దరూ విడిపోవడానికి కారణం రఘువరన్ మళ్లీ మద్యానికి పదార్థాలకు బానిస కావడం. విడాకుల అనంతరం రఘువరన్ కర్ణాటకలో ఒక ఆశ్రమంలో చేరి చికిత్స పొందారు. 2008లో ఆయన కన్నుమూశారు.
End of Article