‘ఆదిపురుష్’ సినిమా పై ఫైర్ అయిన మరో బాలీవుడ్ యాక్టర్..

‘ఆదిపురుష్’ సినిమా పై ఫైర్ అయిన మరో బాలీవుడ్ యాక్టర్..

by kavitha

Ads

‘ఆదిపురుష్’ సినిమా పై విమర్శలు ఇప్పటికీ ఆగడం లేదు. డైరెక్టర్ ఔం రౌత్ ఈ సినిమాను ఏ సమయంలో ప్రారంభించాడో కానీ ఈ మూవీ మొదటి నుండి విమర్శల పాలవుతునే ఉంది. సామాన్యుల నుండి సినీ, రాజకీయ ప్రణుఖుల వరకు మేకర్స్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Video Advertisement

అయితే ఈ చిత్రం పై తాజాగా మరో యాక్టర్ ఆదిపురుష్ మూవీ మేకర్స్‌ పై మండిపడ్డారు. బాలీవుడ్ యాక్టర్, బిగ్ బాస్‌ కంటెస్టెంట్ అయిన విందు ధారా సింగ్ ఆదిపురుష్ మేకర్స్‌ పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..బాలీవుడ్ యాక్టర్ విందు ధారా సింగ్ ఆదిపురుష్ మూవీ యూనిట్ పై మండిపడ్డారు. విందు ధారా సింగ్ ఎన్నోసార్లు హనుమంతుడి పాత్రలో నటించారు. అతను మాత్రమే కాకుండా విందు ధారా సింగ్ తండ్రి, దివంగత యాక్టర్ ధారా సింగ్, రామానంద్ సాగర్ రూపొందించిన బుల్లితెర రామాయణంలో హనుమంతుడిగా నటించారు. ముఖ్యంగా హనుమంతుని క్యారెక్టర్ ను వక్రీకరించడం పై తీవ్ర అసంతృప్తిని తెలిపారు.
adipurush ban విందు ధారా సింగ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆదిపురుష్ మూవీ నిర్మాతల తీరుపై విమర్శలు చేశారు. అలాగే హనుమంతుడి పాత్రను పోషించిన దేవదత్తా నాగేపై సటైర్లు వేశాడు. హనుమంతుడు పాత్ర చేసిన దేవదత్తా నాగే హిందీలో సరిగ్గా మాట్లాడలేడు. ఇక అతడికి ఇచ్చిన డైలాగ్‌లతో హనుమంతుడి పాత్రను వేరే విధంగా చూపారు. ఈ విషయంలో ప్రొడ్యూసర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. హనుమంతుడి క్యారెక్టర్ లో తన తండ్రి చరిత్ర సృష్టించాడని, ఆయన యాక్టింగ్ కు దరిదాపుల్లోకి సైతం రాలేరని మండిపడ్డారు.
‘మేకర్స్ చేసిన పనిని చూస్తే సిగ్గుగా ఉంది. వీళ్ళు మందు తాగి వచ్చారో? ఏం ఆలోచిస్తున్నారో కూడా వారికే తెలియదు. ఇంత భారీ బడ్జెట్‌ పెట్టి అద్భుతమైన మూవీ తెరకెక్కించే బంగారం లాంటి అవకాశాన్ని నాశనం చేశారు. రామాయణం  స్టోరీతో ఆడుకున్నారు. అందువల్లే ఈ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది’ అని అన్నారు.

Also Read: నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన వారందరికీ థాంక్స్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నిహారిక భర్త..

 

 


End of Article

You may also like